ఆయనకేమైంది ?

Ram Gopal Varma Birthday Party Celebrations HD Photos RGV Birthday Party Pics, Images, Gallery
ఇది నన్ను rgv గురించి కొంతమంది అడిగే ప్రశ్న, “ఏమైంది, బానే ఉన్నాడుగా, మంచిగ తాగుతున్నాడు, సినిమాలు చేస్తున్నాడు, చిల్ అవుతున్నాడుగా” అని నేనంటే అవతల వాళ్ళకి నచ్చదు, వాళ్ళు అనుకున్నట్టు నేను కూడా అనుకోవాలని కోరుకుంటారు. ఇంతకీ వాళ్ళు అనుకునేది ఏంటంటే “ఆయనకి చిప్పులు దెంగాయి, ఏం తీస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో అమ్మాయిలతో ఆ చేష్టలేంటి” ఇవి విన్నప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉంటుందో, మీకు జరగాల్సిందే, మీ బతుకు మీరు బతక్క ఆయన గురించి మీకెందుకు? కాదు ఆయనే మిమ్మల్ని అలా disturb చేస్తున్నాడు, చిలిపి రామూ. మీ దొంగ సంస్కార బతుకులకి ఇది జరగాల్సిందే. మళ్ళీ వీళ్ళే “ఏం సినిమాలు తీసాడు భయ్యా, ఆ పేరంతా చెడగొట్టుకుంటున్నాడు” అని ఫీలయిపోతుంటారు. మరి ఆ పాత సినిమాలు చూసూకుంటూ తల్చుకుంటూ బతికేయొచ్చుగా, ఎందుకు మీకీ మెంటల్ trauma. ఆయన పోస్టులు ఇంటర్వ్యూలు ట్రైలర్ లు చూడటం మానేయండి, అది మాత్రం చేయరు. rgv లేకపోయినా నేను సినిమాల్లో ఉండేవాడినేమో కానీ వర్మ అనే పేరు టీనేజ్ లో క్రియేట్ చేసిన సెన్సేషన్ నాలో ఇంకా పోలేదు, ఇలాంటి మొహాల మీద కెమెరా పెట్టొచ్చు, కెమెరాని ఇలా వాడొచ్చు, కట్ లో ఎంత చేయొచ్చో సౌండ్ తో ఎంత effective గా ఆడుకోవచ్చో లాంటి ఆలోచనలు కలిగించింది వర్మ. మళ్ళీ ఇవేవీ పనికిమాలిన సినిమా post-mortem లు చేసి తెలుసుకున్నవి కాదు. rgv సినిమా చూస్తుంటే చాలు ఏదో ఒక కొత్త ఆలోచన వచ్చేది. నన్ను ఉర్రూతలూపిన rgv సినిమాలు చాలు నాకు జీవితాంతం ఆరాధించడానికి. మీరూ ట్రై చేయండి, ఒక్కసారి rgv పాత సినిమాలు చూడండి, మీలో ధ్వేషం తగ్గుతుంది అది మీకూ సమాజానికి కూడా మంచిది. ఒక్క సత్య చాలు man, హిందీ సినిమాని మలుపు తిప్పిన సినిమా. మీరేమన్నా అనుకోండి ఈ విషయంలో ఇంకో మాటలేదు. ఇప్పుడొస్తున్న మీర్జాపూర్లని పుట్టిస్తున్న సినిమా సత్య. బాంబేలో కంపనీ పెట్టి అక్కడ్నుంచి వచ్చిన దర్శకులు వాళ్ళతో వర్మ తీసిన సినిమాలు ఆ తర్వాత అదే దర్శకులు బయటతీసిన సినిమాలు హిందీ & భారతీయ సినిమాలో కొత్త ఆలోచనలు తీసుకొచ్చాయి. “సినిమా తీయడం పెద్ద కష్టమేం కాదు” అనే బలుపుని యువకుల నరనరాల్లో నింపిన the great influencer rgv. ఇవేవీ నేను అనుకుని చేసినవి కాదు అలా జరిగిపోయాయి అనే వర్మ మాటలు వింటే ఇది కదా సినిమా madness అంటే, అనిపించింది తీసుకుంటూ పోవటం హిట్టు ఫ్లాపులకి అతీతంగా బతికేయడం మామూలు విషయం కాదు. అందుకే మీకు కుళ్ళు rgv మీద. టిఫిన్ తినేటప్పుడు మాత్రమే rgv ఇంటర్వ్యూస్ చూస్తా నేను, మూడో దోశ అయిపోగానే ఆపేస్తా చూడటం. so ఆయన ‘ism’ ఏదీ నాకు పెద్దగా పట్టదు, పట్టించుకోను కూడా, క్షణక్షణం కాసేపు చూస్కంటే ఆ మానసిక భావప్రాప్తి చాలు. అయినా అలా పోస్టులు పెట్టడానికి మాట్లాడటానికి చాలా దమ్ము కావాలి, ఎంత ‘కంటెంట్’ అది న్యూస్ వాళ్ళకీ డిజిటల్ జనాలకి. వాళ్ళ revenue stream లో అదొక భాగం, సంపద సృష్టిస్తున్నాడు బ్రో. బాగా ఓవరయింది కదా? ఇంకా చేయాలనుంది. లారీల వెనక నన్ను చూసి ఏడ్వకు అని ఎన్నిసార్లు చదువుకునుంటాం, ఎదగండి ఏడవకండి rgv ని చూసి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *