‘వ్యసనం’ అనే title తో నాలుగేళ్లుగా రకరకాల కథలు అనుకున్నా, ఒక series అనుకున్నా, పది వ్యసనాలు పది కథలు పది episodes. పది పాటలు కూడా అనుకున్నా, కానీ ఇది నేను ఏ నిర్మాతకి ott కి చెప్పి convince చేయలేను అనే confidence నాలో ఉంది. అందుకే మా స్టైల్లో నే చేయాలి ఇది, అప్పుడే ఆ originality ఉంటుంది. అందులో భాగంగానే మొదటి story shoot రేపు అనుకున్నా, కానీ జరగడం లేదు. ఆగిపోలేదు వచ్చే ఆదివారానికి postpone అయింది.
అన్నీ అనుకున్నట్టు జరిగితే అది cinema ఎలా అవుతుంది? Budget ఉంటే జరుగుతాయేమో మాలాంటి వాళ్లకి అలా జరగదు. నేను 1,60,000/- అనుకున్నా, ఈరోజుకి 40,000/- వచ్చాయి. అయినా సరే ఎలాగోలా shoot చేసేద్దాం అని నిన్న రాత్రి కూడా plan అదే. పొద్దున నిద్ర లేస్తూ ఆలోచించా, ఎందుకింత stress తీసుకుంటున్నా? ఒక వారం postpone చేస్తే పోయేదేం లేదు, అనుకున్నంత రాకపోయినా ఇంకొంచెం డబ్బులు వస్తే అనుకున్నట్టు కాకపోయినా వేరే రకంగా shoot చేయొచ్చు. Compromise మంచిదే, అదే కదా indie బతుకు.
Technical గా నేను ott standards లో చేద్దాం అనుకున్నా, ఊరికే సరదాగా, అదేదో ott వాడు కొనేస్తాడని కాదు. Audience వాళ్ళ ఇళ్లలో ఎంత big screen మీద చూసినా అదిరిపోవాలి visual & sound అనుకున్నా. ఇప్పుడు plan మారింది, రోజుకి 20,000/- కెమెరా ఇప్పుడు 8500/- camera అయింది. ఏం బాధ లేదు ఆ మాత్రం camera చాలు. నేను అనుకున్న 60 minutes రాకపోయినా kuch farak nahi padtaa, అరగంట cinema తీద్దాం, అసలు length గురించి ఆలోచించొద్దు అని decide అయ్యాము.
ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంది.
ఎంత pressure తగ్గించుకుంటే అంత మంచిది. నేనొక సినిమాకి line producer గా పని చేస్తున్నా వచ్చే వారం జీతం వస్తుంది, దాంట్లో ఖర్చులకి ఉంచుకుని 15-20వేలు shooting కి వాడేస్తా, ఈలోపు ఇంకొంచెం ఎలాగూ వస్తాయి. ఊరికే నువ్వు సింత పడకే ఉంటాదిలే దారి.
అంతా మన మంచికే అనుకోవడం మాకు అలావాటైపోయింది, ఈ వారంలో ఇంకొంచెం better ideas వస్తాయేమో. next sunday తీయడం మాత్రం పక్కా, shooting చేయాలన్న ఆత్రం రోజురోజుకీ పెరిగిపోతోంది.
Shooting is a remedy, జీవితంలో ఉన్న సమస్యలన్నీ పక్కన పెట్టి ఒక కథని తీయాలి అనే ఊహలోకంలో బతకడం బాగుంటుంది.
కింద నా మొదటి pitching article link ఇస్తున్నా చదివి contribute చేయాలి అనుకుంటే డీటెయిల్స్ కింద ఉన్నాయి.