స్పందన బాగుంది, సినిమా మొదలైంది

నిన్న నేను రాసిన post చదివి కొందరు స్పందించారు, 1,60,000/- target లో 33,000/- వచ్చాయి. Thanks a lot guys. డబ్బులు రావటం మొదలవగానే shooting plan మొదలైపోయింది. వచ్చే ఆదివారం first day shoot, actors, technicians, equipment n location fix అయిపోయాయి. వచ్చిన డబ్బుల్లో equipment advance కట్టేసాం. మాకెందుకు ఇవన్నీ అనుకుంటున్నారా, నా ఆనందం కోసం రాస్తున్నా, ఇలా film ప్రోగ్రెస్ updates ఇస్తూ ఉంటే నాకూ ఒక  రెస్పాన్సిబిలిటీ feel ఉంటుందని రాస్తున్నా. Shoot కి వెళ్ళేలోపు మిగతా డబ్బులు కూడా వస్తాయనే నమ్మకం ఉంది.

Filmmaking process అత్యంత exciting విషయం ఏంటంటే, planning. అందరితో మాట్లాడుతూ ఒక దాని తర్వాత ఒకటి confirm అవుతుంటే ఒక పక్క pressure ఇంకో పక్క pleasure. ఎలా తీస్తామో ఏం వస్తుందో అనే pressure at the same time pleasure making a new film. Regular గా మేము తీసే style లో ఉండే concept ఇది కూడా, అయినప్పటకీ లోపల ఏదో గుబులు, అనుకున్నది ఎంతవరకు achieve చేస్తామో అని, చూద్దాం.

Story discussion ఇలానే మొదలైంది, అస్సలు డబ్బులు లేక అవస్థలు పడుతున్న టైంలో, ఖర్చులకి అడిగే బదులు ఏదన్నా పనికి అడిగితే బాగుంటుంది అనిపించి, ఒక్కో episode కి ఒక నిర్మాత అనే concept తో approach అయ్యాం, చాలా మంచి response వచ్చింది, మేం అనుకున్న budget కన్నా ఎక్కువే అయినా somehow we managed and finished it. ఈసారి కూడా అదే ధైర్యం నమ్మకం, కానీ ఈసారి ఎక్కువ time తీసుకోకుండా finish చేయాలన్నది plan.

నిర్మాత అనే వాడికి వీలైనంత తక్కువ “pain” అనిపించాలి మాతో cinema తీస్తే అనేది నా ఐడియా. డబ్బులు పెట్టి అవి వస్తాయో రావో అనే బాధ మామూలుది కాదు, ఒక నష్టపోయిన film distributor కొడుకుగా ఆ నష్టం ఎంత ఘోరంగా ఉంటుందో నాకు తెల్సు. 90% సినిమాలు ఫ్లాపులే, కొందరు తట్టుకోగలుగుతారు మరి కొందరు నిర్మాతలు జీవితంలో cinema జోలికి రారు. ఇలా 10-20 మందిని gather చేసి తలా కొంచెం నష్టపోయినా అది అంత బాధ అనిపించదు.

99/- నుంచి 10000/- దాకా donate చేసారు నిన్నటి నుంచి, ఈ స్పందన చాలా ఆనందాన్ని ఇచ్చింది. మేము ఖర్చు పెట్టే budget లో 50-60% వెనక్కి వచ్చినా మేము సక్సెస్ అయినట్టే. ఈ multiple producers అనే concept ని ముందుకు తీసుకెళ్లొచ్చు.  ఇది మేము ఎప్పుడూ చేస్తున్నదే, కానీ ఈసారి పెట్టిన వాళ్లకి ఎంతో కొంత వెనక్కి ఇవ్వాలి అనేది plan. 

మళ్ళీ మరిన్ని updates తో మీ ముందుకొస్తా. నిన్నటి link కింద ఇస్తున్నా, షేర్ చేసి సపోర్ట్ చేయండి, ఇంకోసారి డబ్బులు పంపిన అందరికీ వేల వేల వందనాలు, మీరే మా నిర్మాతలు.

The original post