Sheesh Censor

ముందుగా ఒక very very very interesting statement తో మొదలుపెడతా, 2015 లో ndtv లో censor గురించి జరిగిన చర్చలో అప్పటి censor board member ( screen మీద అలాగే వేసారు) నందిని సర్దేశాయ్ మాట్లాడుతూ “It’s called CBFC, CBFC అంటే Central Board of Film Certification, దురదృష్టం కొద్దీ ఇది Censor Board గానే తెలుసు అందరికీ. ఇది బ్రిటిష్ రాజ్ వారసత్వం, అప్పట్లో సినిమాల్లో జాతీయవాద మరియు దేశభక్తిని ప్రేరేపించే సీన్లను బ్రిటిష్ వాళ్ళు ‘సెన్సార్’ చేసేవాళ్ళు. బాధాకరమైన విషయం ఏంటంటే సినిమాలని certify చేయకుండా ఆ బ్రిటిష్ కాలం నాటి hangover నే continue చేస్తున్నాం, “moral policing” చేద్దామని అనుకుంటున్నాం, నాకు దానిపై నమ్మకం లేదు. నేను 16-20 ఏళ్ళ పిల్లలతో డీల్ చేస్తుంటా, నా జుట్టు తెల్లబడినప్పటికీ నేను వాళ్ళ wave length లోనే ఉంటాను, exact గా వాళ్ళు ఎలా మాట్లాడతారో నాకు తెలుసు, బూతులు ban చేయడాన్ని నేను సమర్ధించను, వాళ్ళ మాటల్లో అవి భాగం. నా ఉద్దేశంలో CBFC పనేంటంటే content చూసి A,U, U/A అని certify చేయాలేగాని censor చేయకూడదు. ఒకవేళ certify చేసే process లో ఏదైనా సీన్ అత్యంత అభ్యంతరకరంగానో, దేశ సమగ్రతకు భంగం కలిగే విధంగా లేదా law & order సమస్య సృష్టించే విధంగానో ఉంటే దాన్ని తొలగించమని filmmaker ని అడగొచ్చు, అప్పటికీ revising committee లేదా tribunal కి వెళ్లే హక్కు filmmaker కి ఉంది. Freedom of expression ని అణచివేయటం కరెక్ట్ అని నేను అనుకోవటం లేదు“ అది మ్యాటర్, so censor board కాదు certification board, censor అనే పదాన్ని నా జీవితంలో నుంచి సెన్సార్ చేయటానికి ప్రయత్నిస్తా, ఇక నుంచి మీ సినిమా certify అయిందా అని అడుగుతా, కష్టమే, తరతరాలుగా censor కి గురయిన నేను మారటం అంత ఈజీ కాదు. శీష్ censor, ప్రస్తుతానికి సెన్సార్ అనే అనుకుందాం, గత డిసెంబరులో అర్జంటుగా రిలీజ్ చేసేయాలని ఐదు రోజుల్లో సెన్సార్ పనులకి పూనుకున్నాం, అది అలా జరగదని నాకు తెల్సు, కానీ నా చుట్టూ ఉన్న యువ మిత్రులంతా చేసేద్దాం అవసరమైతే సెంట్రల్ మినిష్టర్ రికమెండేషన్ చేపిద్దాం అనేసరికి వామ్మో వీళ్ళకి ఎదురు చెప్పడం ఎందుకులే అని నేనూ రంగంలోకి దూకా. ఇప్పుడు కొన్ని administrative విషయాలు, మా సినిమా టైటిల్ ఎప్పుడో రిజిష్టర్ చేసి వదిలేసాం ఇప్పుడది రెన్యువల్ చేయాలి, అసలుందా ఇంకెవరైనా రిజిష్టర్ చేసుకున్నారో లేదో కూడా తెలియదు, కనుక్కుంటే available అని తెల్సింది, దాని రిజిష్ట్రేషన్ కే వారం పదిరోజులు పడుతుందని తెల్సింది. ఆ ప్రాసెస్ మొదలైంది, పబ్లిసిటీ క్లియరెన్స్ కి ఐదు పోస్టర్లు ఇవ్వాలి, ఇలా ఒక్కొక్క పని మొదలైంది. మొదటిది ముఖ్యమైనది censor script, సినిమాలో ఏముందో అంటే ఫైనల్ కట్ లో ఏముందో అదంతా డైలాగులతో సహా టైప్ చేయాలి, దీనికి experts ఉంటారు, వాళ్ళు ఇదే పని మీదుంటారు. వాళ్ళు మేమడిగిన టైంకి ఇవ్వాలంటే డబ్బులు ఎక్కువడిగారు, అర్జంటుగా కావాలంటే ఖర్చవుతుంది మరి. అంత ఇవ్వడం కష్టంలే మనమే రాసేద్దాం రెండు రోజుల్లో అని మొదలుపెట్టాం, ఇది blunder, వారం పట్టింది మేము చేసిన తప్పులన్నీ కరెక్ట్ చేసి ఫైనల్ submit చేయడానికి. ఎవరు చేయాలిసిన పని వాళ్ళే చేయాలి, ఇంకెప్పుడూ ఈ తప్పు చేయదల్చుకోలేదు. next పని, censor copy, video file mp4 చేసి ఇస్తే అప్పుడు సెన్సార్ కి submit చేయొచ్చు. అది కూడా pen drive లో ఇయ్యాలి, ఇది రెండు మూడు సార్లు ఫెయిల్ అయింది. ఈ వీడియోలో starting cigaret warning video and on screen smoking drinking diclaimers వేయాలి. అక్కడక్కడ బూతులున్నాయి అవి మ్యూట్ అయిపోతాయని తెల్సు, ముందే ఆ పని చేయొచ్చా అని అడిగా లేదు వదిలేయండి బోర్డ్ మెంబర్స్ చూసి కరెక్షన్స్ ఇస్తారు అన్నారు, వదిలేసాం. Final గా మా సెన్సార్ దినం వచ్చింది, masabtank లో సెన్సార్ చేసే ఆఫీసు, అక్కడే స్క్రీనింగ్. board chairman & board members cinema చూస్తున్నారు, కొద్దిసేపు అక్కడే పెన్షన్ కోసం కూర్చునే senior citizens లాగ కూర్చున్నాం , బోర్ కొడుతుంటే దగ్గరలో ఉన్న దివ్య ఇంటికి వెళ్ళి చాయ్ సిగరెట్ తాగి bitching చేసుకుంటూ ఒక గంట టైంపాస్ చేసి మళ్ళీ సెన్సార్ ఆఫీస్ కి వెళ్ళాం. సినిమా అయిపోయింది, నన్ను రోహిత్ ని లోపలికి పిలిచారు, చిన్న కాన్ఫరెన్స్ రూం, chairman ఒక లేడీ ఆఫీసర్,IAS, తెలుగావిడ కాదు కానీ తెలుగొచ్చు, ఇంకో నలుగురు బోర్డ్ మెంబర్స్ కూర్చున్నారు, అందరి చేతిలో white papers & pen ఉన్నాయి, చూస్తూ రాసుకుంటారు. మీకు U/A ఇస్తున్నాం, హమ్మయ్య పాసయ్యాం అనిపించింది. ఆ తర్వాత ఆవిడ మ్యూట్ చేయాల్సిన మాటలు చదివి వినిపించి అవి ఏ సీన్లో కూడా చెప్పారు. పది నిమిషాల్లో బయటకొచ్చాం, అన్నీ నేను expect చేసిన సెన్సారులే ఒక్కటి తప్ప. ఆ రోజు ఒక్క కోరిక పుట్టింది వైట్ పేపర్లతో సెన్సారు షో చూసేవాళ్ళు ఆ పేపరు మీద పెన్ను పెట్టకుండా బయటకొచ్చే సినిమా తీయాలని. అంటే no cuss words smoking drinking exposing ఇలాంటివి ఏమీ లేని సినిమా, cleanest film, ముత్తాత దగ్గర్నుంచి మునిమనవరాలు దాకా కుటుంబమంతా కలిసి చూసే సినిమా, జోకనుకుంటున్నారా? కాదు iam serious. ఒక సంత్సరంలో బోర్డ్ ఛైర్మన్ ఎన్ని సినిమాలు చూడాల్సొస్తుందే తెలిసి షాక్ అయ్యా, AC లో కూర్చుని సినిమాలు చూడటమేగా అనిపించొచ్చు అదెంత స్ట్రెస్సో ఆలోచించండి. కొన్ని రోజులకి మా సినిమా సర్టిఫికెట్ వచ్చింది, అప్పుడు మొదలైంది నాలో ఒక ఆలోచన, బూతులన్నీ మ్యూట్ చేసేసాం, ఒక వల్గర్ గ్రాఫిటీ గోడమీదుంటే అది బ్లర్ చేయమంటే ఆ గోడని క్లీన్ చేసేసాం, మరెందుకు U/A మాకు? ఒక ముద్దు లేదు క్లివేజ్ లేదు తొడ వర్ణనలు లేవు, తొడగొట్టి తలకాయలు ఇతర కాయలు నరికే సీన్లు లేవు, చుక్క రక్తం లేదు, ఊపుల తోపుల ఐటెం సాంగ్ లేదు, U ఎందుకివ్వలేదు, అసలప్పుడే ఎందుకు అడగలేదు మేము ? అఖండ, పుష్ప లకి U/A ఇచ్చి మాకూ U/A నే ఇవ్వడమేంటి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *