“మారోజుల్లో ఎలా ఉండేదంటే” అనే వయసుకి ఎప్పుడో వచ్చేసాను నేను, నాతో సిట్ట్ంగ్ వేసినప్పుడల్లా పాత జ్ఞాపకాలే. చెప్పినవే మళ్ళీ చెప్పే చాదస్తం వచ్చేసింది, నాకు ముసలోళ్ళ చాదస్తం అర్ధమవుతోంది, వాళ్ళని తప్పించుకుని తిరిగిన రోజులు గుర్తొస్తున్నాయి, నేనూ అలానే తయారవుతానా? అయితే అవుతా, ఏం చేయలేను, లేదా కాస్త గట్టిగా ప్రయత్నించి జనాలకు దూరంగా బతికితే అయినా నాలో చాదస్తం పెరగకుండా ఉంటుందేమో. జనాలతో మాట్లాడకుండా కలవకుండా ఫోన్ అవసరం ఉన్నప్పుడే On చేసుకుంటూ, ఎలాంటి websites n youtube చూడకుండా గట్టిగా పదిహేను రోజులైతే ఉండగలను, కనీసం అదైనా ప్రయత్నించాలి. ప్రస్తుతానికి అంత luxury లేదు కాబట్టి నా పాత జ్ఞాపకాలతో జనాల్ని అలరిస్తూ విసిగిస్తా.
ఇప్పుడు “మారోజుల్లోకి” వెళ్దాం, పాతికేళ్ళకే కమర్షియల్ సినిమాకి దూరమవటం మొదలైంది నాలో, అది conscious గా చేసిన ప్రయత్నం కాదు. అదలా జరిగిపోయి, 30-32 కల్లా పూర్తిగా దూరమయ్యాను, ఆ తర్వాత కొన్ని చూసినా గుర్తులేవు. గత నాలుగేళ్ళలో సంవత్సరానికి ఒకటి లేదా రెండు సినిమాలు చూసుంటాను. Hardcore సినిమా ప్రేక్షకుడినైన నేను, రిలీజ్ రోజు మార్నింగ్ షో చూడకపోతే విలవిలలాడిన నేను, సినిమాకి దూరమైపోయాను. ఎన్నో కారణాలు.
19-24 నేను బతికిన జీవితం ఒక మేజర్ కారణం, ఆర్ధికంగా డక్కామొక్కీలు తింటూ, సినిమా అనే fantasy ప్రపంచంకి కొంచెం దూరమై selective గా సినిమాలు చూడటం మొదలైంది. Sweet films feel good films cute love stories చిరాకు తెప్పించేవి. చిరంజీవి ఒక్కడు చాలు ఈ జీవితానికి, నా fanboy వారసత్వం కొనసాగించను అని మొండికేసి, చిరంజీవి ప్రయత్నించిన కొన్ని చిత్రవిచిత్రమైన సినిమాలు చూసి, సారీ చిరు నాకు నీ నుంచి రౌడీ అల్లుడు ముఠామేస్త్రీలే కావాలి అని చిరంజీవి సినిమాలు చూడటం మానేసా, అభిమానం అలాగే ఉంది.
ఆ తర్వాత తరం హీరోల సినిమాలు నాకు ఎక్కలేదు, వైర్ల ఫైట్ల విన్యాసాలు విరక్తి పుట్టించాయి, మీరిచ్చే వార్నింగులు బోరింగ్ అయిపోయాయి అనుకుని తెలుగు కమర్షియల్ సినిమాలు చూడటం మానేసా. ఇంకొక irritating thing ముంబై హీరోయిన్లు, దేవకన్యల్లా మెరిసిపోతుంటారు, పిచ్చెక్కించే అందాలు, కావాల్సినంత exposing, కానీ నటన శూన్యం. 99% అదే category, మన రచయితలు డైరెక్టర్లు కూడా పెద్దగా character ఏమీ రాయరు, హీరో వెంటపడటానికో హీరో వెంటపడే బుర్ర తక్కువ అమ్మాయి అయితే చాలు అనుకుంటారు కాబట్టి, అవి అస్సలు భరించలేకపోయా. వాళ్ళ డబ్బింగ్ అయితే అన్యాయం, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
ఆడియెన్సులకి ఆ గ్లామరే కావాలి బాసూ అనే వాళ్ళతో వందల వాదోపవాదాలు చేసి అలసిపోయి, yes మీరే కరెక్టు, నచ్చనప్పుడు చూడటం మాట్లాడటం మానేస్తే better కదా, అదే చేసాను నేను. ఇప్పటికీ మాట్లాడుతుంటా గానీ, no arguments about commercial cinema. నేనూ అలాంటి కమర్షియల్ చూస్తూనే పెరిగాను, ఎప్పటికప్పుడు అలాంటి generation ఉంటుంది కాబట్టి అలాంటి సినిమా వస్తూనే ఉంటుంది, so నాకు ఇప్పుడు ఆ సినిమా మీద ఎలాంటి కంప్లైంట్ లేదు. “ఛా మేధావి వేషాలు బాగా వేస్తావురా నువ్వు”
అనిపిస్తే దయచేసి నన్ను అలా అపార్ధం చేసుకోకండి, పాపం తగులుతుంది.
మొదట్లో సినిమాకి ముందు వచ్చే advertisements బానే ఉండేవి, మళ్ళీ మళ్ళీ అవే చూడాల్సి రావటం విసుగొచ్చేది. మల్టీప్లెక్సుల్లో సినిమా చూస్తున్నప్పుడు cute kids థియేటర్లో అరుస్తూ ఆడుకుంటుంటే గుక్కపెట్టి ఏడుస్తుంటే బిక్క చచ్చిపోయి ఎందుకొచ్చాను నేను అనిపించేది. Next category phone calls and messages, ఇంక నా వల్ల కాదు అని decide అయిపోయా, ఆ తర్వాత వికృత సిగరెట్ యాడ్స్, అది కూడా రెండు సార్లు, భగవంతుడా ఏమిటి నాకీ ఖర్మ అనుకుని adjust అవుదాం అని try చేసా కానీ అవలేదు. జాతీయగీతం రాకతో నాకు థియేటర్ కి వెళ్ళాలి అన్న కోరిక పూర్తిగా చచ్చిపోయింది. School నుంచి college ముగిసేవరకు అపురూపంగా సంత్సరానికి మూడు నాలుగు సార్లు పాడుకునే ‘జనగణమన’ గీతాన్ని సినిమాకి ముందు వేయాలి అన్న ఆలోచన ఏ మహానుభావుడికి వచ్చిందో గాని, దాని విషయంలో థియేటర్లలో జరిగిన గొడవలు, జాతీయగతం మనల్ని కలపాలి గానీ తిట్టుకుని కొట్టుకునేలా చేస్తోంది ఏంటి అని బాధేసింది. నా education 19ఏళ్ళకే ఆగిపోయింది, కానీ ఆగస్టు 15 జనవరి 26 మీద ప్రేమ పోలేదు, ప్రతి సంత్సరం జింఖానా గ్రౌండ్స్ కి వెళ్ళి national anthem పాడి జెండాకి సెల్యూట్ కొట్టే సాంప్రదాయం చాలా ఏళ్ళే కొనసాగించాను. పాడుతుంటే రోమాలు నిక్కబొడిచే జనగణమన సినిమా హాల్స్ లో వేయటం అనేది కరెక్ట్ కాదు అనిపించింది, ఒకవేళ వెళ్ళినా అదయ్యాక థియేటర్ లోపలికి వెళ్ళేవాణ్ణి, ఆ బయట నిలబడేదో లోపల నిలబడొచ్చు కదా అనుకోవచ్చు, ఎందుకో అలా అనిపించలేదు.
మా రోజుల్లో ఎలా ఉండేదంటే సినిమా చూడటం, ఏవో కొన్ని స్లైడ్స్ పడేవి, తర్వాత సినిమా మొదలైపోయేది, అదొక magical experience.
నా రాత మీకు నచ్చితే కింద qr code ఉంది కొట్టగలిగినంత కొట్టేయండి.