ఈ మధ్య నన్ను కలుస్తున్న కొందరిని నేను అడుగుతున్న ప్రశ్న ? 5-6 ఏళ్ళ క్రితం వరకు కూడా social media లో ఈ topic మీద discussions చూసి ఎందుకింత రాద్దాంతం చేస్తున్నారు, mental health కి మించిన ఎన్నో సమస్యలున్నాయి కదా అనుకునేవాణ్ని. మెల్లిగా నా చుట్టుపక్కల ఉన్న friends MH issues తో suffer అవడం చాలా దగ్గరగా చూస్తున్నాను, అది ఎంత వరకు వెళ్లిందంటే ఆత్మహత్యల దాకా.
మానసిక సమస్యలు అస్సలు మాట్లాడుకోని generation నుంచి వచ్చినవాణ్ని, ఒకవేళ అలాంటిది ఏమన్నా ఉంటే పిచ్చి కింద consider చేసిన తరం మాది. ఇప్పటికీ psychiatrist or psychologist దగ్గరికి వెళ్ళటం అనేది ఒక taboo లాంటిదే. నాకు mental గా ఏం issues లేవులే అనుకుంటూ తిరిగిన నేను counselling కి వెళ్తున్నా ఇప్పుడు, నాలుగు sessions అయ్యాయి. అప్పుడే ఏదో జరిగిపోతుందని ఆశించడం లేదు కానీ నా problems గుర్తిస్తున్నాను, మారడానికి మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా. ఇదొక సుధీర్ఘ ప్రయాణం.
Open గా discuss చేయాల్సిన విషయం ఇది, మనలో మనం నలిగిపోతూ కుంగిపోతూ దాచుకోవద్దు, ఎవరో ఒకళ్ళతో మీకున్న బాధలు పంచుకోండి, అవసరం అనిపిస్తే specialist ని consult అవండి, మందులు వాడండి. నేను వెళ్తున్న psychologist చెప్పిన మాట ఏంటంటే చాలా mental health issues counselling తో control లోకి తీసుకురావచ్చు అని. కానీ చాలా మంది ఆ పని చేయరు అస్సలు నాకు problem ఉంది అని ఒప్పుకోవడానికే ఇష్టపడరు. మనందరం మానసిక సమస్యలతో బతికేస్తున్నాం, అవి చాలా దూరం వెళ్లిపోతున్నాయి.
ముఖ్యంగా social media చాలా disturb చేస్తుంది కానీ ఫోన్ కి దూరంగా ఉండలేం, నేను అన్నీ deactivate చేసి అకౌంట్స్ delete చేసి సంవత్సరం దాటిపోయింది, ప్రశాంతంగా ఉంది. కానీ ఇంకా మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, ముఖ్యంగా మందు addiction. ఇది నా బిగ్గెస్ట్ problem. ఇప్పుడిప్పుడే control లోకి వస్తోంది. పూర్తిగా మానేస్తాను అనే పెద్ద target పెట్టుకోలేదు, ఎంత వీలయితే అంత దూరంగా పెట్టడం అయితే మొదలుపెట్టా.
నా బలం నా చుట్టూ ఉన్న friends, నన్నూ నా విపరీత ప్రవర్తనని ఎంత భరించారో చెప్పలేను. ఇంక దానికి full stop పెట్టాలి, ఇప్పటికే చాలా జరిగిపోయింది. మందు Mental health సమస్య అందరికీ కాకపోవచ్చు కానీ నాలాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు, వాళ్లకి వాళ్ళు సమస్యలు సృష్టించుకుంటూ family members కి friends కి పెద్ద సమస్య అయిపోతారు. నాకు తెల్సిన ఇద్దరు very young friends అలా తాగిన ఆవేశంలో life end చేసుకున్నారు, ఎంతో అనుభవించాల్సిన వాళ్ళు ఇక లేరు. మా అందరికీ కోలుకోవడానికి చాలా time పట్టింది, మరుపొక్కటే మార్గం.
ఏదో రాయాలని మొదలుపెట్టాను, ఇంక ముగిస్తా. Mental health ని పట్టించుకోండి, మాట్లాడండి దాని గురించి, share చేసుకోండి, పంచుకుంటే ఎంతో కొంత భారం తగ్గుతుంది. మగాడు చాలా strong అనే పిచ్చి ఆలోచన వదిలేయండి తమ్ముళ్ళూ, ఏడ్వాలనిపిస్తే ఎవరో ఒకళ్ళని hug చేసుకుని ఏడ్చేయండి.