Old blog post from Divya’s personal blog:
ఆయన పేరు గుర్తొచ్చిన, ఎవరినైనా కలిసినప్పుడు టాపిక్ అటువైపుగా మర్లితే చాలు నోరు మూసుకోవడం బెటర్‌గా ఫీల్ అయ్యేదాని. అలా చెయ్యడం మర్యాద కూడా, నిజం చెప్పాలంటే విపరీతమైన భయం. ఎక్కడైనా ఎవరికైనా దొరికిపోతానో అనే ఆలోచనతోనే సగం సేపు ఈ డిస్కషన్ నుండి దూరంగా పారిపోవడం, ఇగ్నోరన్స్ ఇస్ థి బ్లిస్స్ అని వినివిననట్టు ఉండడం అలవాటు చేసుకున్నాను. ఆయన రాసిన పుస్తకం సైజు, దానిలోని రివాజులు ఎప్పటికప్పుడే వణికిస్తుంటాయి(చదివితే అర్ధం అయ్యేదేమో). నా ఖర్మ కొద్ది నేను ఎకనామిక్స్ మాస్టర్స్ చదివినా కూడా బేసిక్స్ వరకే నా ప్రతాపమని నాకు ఎప్పుడో తెలిసిపోయింది. నేను రాసే నా తెలుగు పోస్టలాగే నా ఎకనమిక్స్ నాలెడ్జ్ కూడా మిడిమిడి వ్యవహారమే. డిగ్రీ దాకా కామర్స్ చదివిన నేను మాస్టర్స్ మాత్రం ఎకనామిక్స్ లో చేశాను. ఇంకో వండర్ఫుల్ థింగ్ ఏంటంటే ఇండియాలో ఏ విశ్వవిద్యాలయాల్లో(central universities) అయినా మినిమమ్ డిగ్రీ ఎకనామిక్స్ లో చేస్తేనే మాస్టర్స్ కి అర్హులు. నాకు తగ్గట్టుగా Hyderabad central University కూడా. ఇక్కడ మాత్రమే కామర్స్ చదివిన వాళ్ళకి ఎంట్రన్స్ రాసే అవకాశం ఉంది. అలా ఎందుకోచ్చిందో కాని నాకు మాస్టర్స్ లో ఎకనామిక్స్ సీట్ వచ్చింది. ఇంకేముంది నా బాధ అంతా ఇంతా కాదు, ఎవడికి చెప్పుకోవాలో తెలియక క్లాసులకి వెళ్లడమే తగ్గించేసా. మూడు సంవత్సరాలు డిగ్రీలో మెయిన్ సబ్జెక్టు ఎకనమిక్స్ గా చదువుకొని వచ్చిన వాళ్ళతో, కర్క్యూలం లో ఉన్న సిలబస్‌తో నేను పడిన కష్టం మాటల్లో చెప్పలేనిది, సఫరింగ్ ఇస్ పెర్సొనల్ అని ఎవ్వడన్నాడో కానీ సెంట్ పెర్సెంట్ కరెక్ట్ అనిపించింది. నాతో తిరిగే క్లాస్మేట్స్ చాలా మంది ఇంటలెక్చల్స్ లా పొగ ఊదుతూ(కొందరు వీళ్ళని వాళ్ళని చప్పరిస్తారు) తెలిసింది కేవలం పుస్తకం పేరైన మొత్తం చదివేసినట్టే కటింగ్‌లు ఇస్తుంటారు. కేశవరెడ్డి భాషలో అయితే చాలా మట్టుకి ఈ ఇంబెసిల్ ముండాకొడుకుల వల్లనే చీటికీ మాటికి భయపడి ఏదీ ఒక పట్టాన చెయ్యాలనిపించదు. అర్థం కాని పెద్ద పెద్ద పదాల్ని వాడి ఎదుటి వాడిని వణికించడంలో వాళ్ళకి ఉండే మజా చెప్పలేనిది. సరే వాళ్లని వదిలేద్దాం, నాకేమోచ్చింది? నేను ఎంత లేజీ దాన్నైతే ఇలా కారణాలు, కంప్లైంట్స్ చెప్తాను. అయినా తప్పు వాళ్లదే, ముందుగానే అవసరం లేనంత భయం నూరి పోస్తే ఇంకెక్కడ నుండి దిగొస్తుంది ప్రేమ. ఒక వ్యక్తినో లేదా వాడు చెప్పిన థియరీని గాని తెలుసుకోవాలన్న ఆసక్తి ఒక రెండు అర్ధరహితమైన మాటలతో అన్నీ పుస్తకాలు మాక్సిమం లైబ్రరీ షెల్ఫ్స్ కి అంకితం చేస్తున్నారు నాలాంటి(మనలాంటి) హాఫ్ అండర్స్టాండింగ్ బ్రైన్స్.
మొన్నీమధ్యే ఆయన గురించి కొన్ని తెలిశాక మొత్తం కాకపోయినా కొంచెం భయం మాత్రం తగ్గింది. ధైర్యం చేసి ఏమైనా తెలుసుకోడానికో, నేర్చుకోడానికో ట్రై చెయ్యొచ్చు అనిపించింది. సస్పెన్స్ థ్రిల్లర్ లో లాగా ఇలా పనికిమాలిన లాగతీయడాలు నాకు చాయ్ బిస్కెట్స్ తో పెట్టిన విద్య. అదే చాలా మంది అంటుంటారు ఏంటయ్యా ఈ లాగ్గింగ్ అని?
ఒక్కో సన్నివేశంలో ఒక్కోలా లాగ్ ఉంటది. ఇక్కడ పెద్దగా రీసన్ ఏమి లేదు. పెద్దగా ప్లాన్ చేసికొని చేస్తుంది కూడా కాదు. ఓకే ఓకే. విషయానికొస్తే నేను మాట్లాడుతుంది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. “కాపిటల్” అనగానే గుర్తొచ్చే వ్యక్తి గురించే, అదే మనకు చాలా మందికి ఎప్పటికి అర్థం కాదు అనుకునే కార్ల్ మార్క్స్ అనే “బహు ప్రజ్ఞాశాలి” గురించి. బహు అన్నారు కాబట్టి ఏమైనా అనుకోవచ్చు. ఎలాగో మార్క్సిజం దాకా పోయే దమ్ము సత్తా నాకు లేవు కాబట్టి బహులో భాగంగా ఆయన ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో గురించి కొన్ని మాటలు చెప్పాలనిపిస్తుంది. Friedrich Engels ఎంతటి గొప్ప స్నేహితుడో మాట్లాడకుండా ఉండలేము(Engels ని ఎలా పలకాలో తెలియని వాళ్ళు, ప్లీజ్ గూగుల్ pronounciation లో వినైనా తెలుసుకోండి, పలకడం వస్తే బాగుంటుంది ఎవరికైనా ఈ పోస్ట్ గురించి చెప్పాలి అనిపిస్తే)
ప్రేమలో అంత ప్రజ్ఞ ఏముంది ? ఇలాంటి ప్రశ్నలకి జవాబు నాదగ్గర లేవు, ఎందుకంటే నేను నిండా ప్రేమలో మునిగి తెలకుండా అక్కడే ఉండిపోయే మనిషిని కాబటి . అసలు ఈ యాంగెల్లో ఆలోచించింది లేదు. ఆయన ప్రేమ, పెళ్లి, ఊర్లు మారడం, జర్నలిజంకి ముందు లా కాలేజ్‌లో చేసిన చిల్లింగ్ కబుర్లు విన్నాక, మార్క్స్ మీద ప్రేమ, అభిమానం ఎక్కువైయ్యాయి. భయ్యా, అన్నిట్లోనూ మొండి మనిషే. దేన్ని కూడా మధ్యలో ఆపేసే తంతు లేనేలేదు(అచ్చం మనలాగే అని చాలా మంది ఫీలింగ్). ఎవడైనా కానీ తన మాటే కరెక్ట్, తను చెప్పిందే నెగ్గాలి అని ఆర్గుమెంట్స్ చేసేవాళ్ళని, మార్క్స్, “ఏంట్రా? కొడతాడు ఏంటి వీడు వినకపోతే?” అనేలా డీల్ చేసేవాడంట. మార్క్స్ ప్రేమ, పెళ్లి, Engles తో చిరకాలపు స్నేహం ఇవన్నీ ఖచ్చితంగ స్పెషల్ టాలెంట్స్ అని నా ఫీలింగ్.
జెన్నీఫర్ లవ్స్ మార్క్స్
ఇది వింటుంటే నాకు తాడి మోహన్ అండ్ ప్రకాష్ బ్రదర్స్ చెప్పిన కొన్ని లేట్ నైట్ స్టోరీస్ గుర్తొచ్చాయి. ఒకసారి మోహన్ ఖైరతాబాద్ ఇంట్లో ఒక వారం ఉన్నాను(అప్పుడు NET ప్రిపరేషన్లో ఉన్నాను, అక్కడ ఉండి చదుకోవడం అన్నది ఒక బాడ్ ఐడియా).మధ్యానమో సాయంత్రమో మోహన్ ఇంటికి వచ్చే ప్రకాష్ గారు కాస్త కబుర్లు చెప్పడం మొదలుపెట్టారు. వాళ్ళ చిన్నతనంలో వీళ్ళ అక్క ఫ్రెండ్స్ ఇంటికొచ్చేవాళ్లని, ప్రకాష్ తో ఫ్రెండ్లీ గా ఉండేవాళ్లని. సరదాగా ఆట పట్టించడానికి చిలిపి పనులు చేసేవాళ్ళని కొన్ని etc etc చెప్పారు(అవి అన్నీ ఇప్పుడు చెప్పలేను. మోహన్, ప్రకాష్ పెర్సొనల్ గా తెల్సిన వాళ్ళకి ఈ స్టోరీలు తెలిసే ఉంటాయి). కార్ల్ మార్క్స్ లవ్ స్టొరీ, కాలేజ్ డేస్ గురించి వింటుంటే ముందుగా నాకు వీళ్ళే గుర్తొచ్చారు(స్పెషల్లీ ప్రకాష్ సార్).
పన్నెండు సంవత్సరాల దాకా స్కూల్ కి వెళ్లని మార్క్స్, వాళ్ళ నాన్న ఫ్రెండ్ Ludwik అనే ఆయన ప్రైమ్ టీచర్ గా పనిచేస్తున్న స్కూల్ లో జాయిన్ చేశారు మార్క్స్ ని. అది కూడా క్రిస్టియన్ స్కూలే. అక్కడ మనోడికి పెద్దగా ఫ్రెండ్స్ లేరు, bullying ఫాక్టర్ ఒకటైతే ఎవరు అంత ఇంటరెస్టింగ్ గా అనిపించకపోవడం ఇంకోటి అయి ఉంటుంది. Ludwik చిన్న కొడుకు Edgar పిచ్చ కూల్ అండ్ వీళ్లిద్దరూ బాగా ఛిల్ల్ అయ్యేవాళ్లట. మార్క్స్ వాళ్ళ అక్క సోఫియా, హెడగర్ అక్క జెన్నిఫర్ లు కూడా ఫ్రెండ్స్. ఇంటికి అక్క ఫ్రెండ్ తరచూ వచ్చేది. మనోడు పెద్దగా పట్టించుకునే వాడు కాదు. వస్తారు, వాళ్ళ పని వాళ్లది మన పని మనది అన్నట్లు ఉండేది. అందులోను వాళ్ళ కన్నా నాలుగు సంవత్సరాలు చిన్న వాడు కూడా. అలా సోఫియా అక్క ఫ్రెండ్ జెన్నిఫర్ అంటే మార్క్స్ కి చిన్నపటి నుండే పరిచయం. మార్క్స్ వాళ్లు ఉండే వీధిలో, ఊర్లోనే జెన్నీ చాలా అందంగా ఉండేదట. అటు వైపు గా నడిచి వెళ్తే, చూడక తప్పని అందం ఆమె సొంతం(ఇది ఓవర్ రేటెడ్, ఓల్డ్ స్టైల్ కూడా అనిపిస్తుంటుంది). మొదట్లో ఇద్దరికి ఎలాంటి ఆలోచనలు , ఒకరి మీద ఒకరికి ఒపీనియన్ ఉండేవి కావు. ఈ మధ్య అక్క ఫ్రెండ్స్ ని flirt చెయ్యడం కామన్ అని మనకి తెలుసు. నేను మాత్రం మా ఇంట్లో ఎప్పుడు వినలేదు.
రెండు వందల సంవత్సరాల కిందటి కబుర్లు కాబట్టి కాస్త డిఫరెంట్ గా ఉండొచ్చేమో అనిపించినా, వెంటనే అది ప్రష్యన్ రాజ్యం అందులోనూ జెర్మన్స్. బార్ కౌన్సిల్ లో జాయిన్ అవుతున్న సమయంలో మార్క్స్ ఒక వ్యాసం రాశాడు, దాని కరెక్షన్స్ కోసం జెన్నీ కి ఇచ్చాడు. బాగా చదుకున్న జెన్నీ అది చదవగానే మనోడి భావాలు, రాత స్టైల్ చూసి షాక్ అయింది. అంటే మన అగ్లీ భాషలో పడిపోయింది సార్ కి. అస్సలు మాతో పాటే సరదాగా ఆడుకునే మార్క్స్ ఇలాంటి భావాలు కలిగిన వాడా? ఇంత ఇంటెన్స్ గా రాస్తున్నాడంటే మనోడి కధ మొత్తం వేరే. ఇలాంటి వాడితో ఉండడం కన్నా ఇంక గొప్పేమి ఉంటుంది అని అతనితో ప్రేమలో పడింది. మార్క్స్ కి ఇదంతా ఐడియా కూడా లేదు. ఆహ్ జెన్నీ నా, అయితే మా అక్క ఫ్రెండ్!! అక్కడి దాకనే బాబు తంతు. జెన్నీ తనని ఇష్టపడుతుంది అని కూడా ఎప్పుడూ అర్థం కాలేదు మార్క్స్ కి. లా చదవడానికి వెళ్ళాడు, ఇంటికి దూరంగా ఉంటున్నాడు. అక్కడే హెగెలియన్ థియరీ వంట పట్టించుకున్నాడు. హెగెల్ థియరీని గట్టిగా నమ్మే వాళ్ళతో ఛిల్ల్ అవ్వడం మొదలైంది. పెద్దగా క్లాస్సెస్ కి కూడా అట్టెండ్ అవట్లేదని, ఇంట్లో వాళ్లు పంపించిన డబ్బులని దుబారాగ ఖర్చు చేస్తున్నాడని, తను ఉండే గెస్ట్ హౌస్ కి లేట్ గా వస్తున్నాడు, తాగడానికి మొత్తం తగలేస్తున్నాడని వాళ్ళ అమ్మ కి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అంటే లెటర్ రాశారు. మార్క్స్ వాళ్ళ నాన్న చాలా సార్లు మందలించాడట కూడా. రెండు సెమిస్టర్లు అవ్వగానే ఇంట్లో వాళ్ళు కూడా రమ్మని గోల పెడుతున్నారని ఇంటికెళ్లాడు మార్క్స్. అప్పుడే జెన్నీ ఈ విషయం చెపినట్టుంది. మార్క్స్ మొదట కాస్త షాక్ అయి ఉంటాడు కానీ తర్వాత వావ్ అనుకోని ఓకే చెప్పేశాడు. వెంటనే జెన్నీ అంటే ఇష్టం పెళ్లి చేసుకుంటానని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పేశాడు మార్క్స్. అసలే హద్దు అదుపులో లేడు, మళ్ళీ కాలేజ్ కి వెళ్ళిపోయాక ఎలా ఉంటాడో తెలియదు, వీడు చదువే ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నాడు ఇంక ఇప్పుడు ఇదొకటి అనుకోని ఇంత చిన్న వయసులో పెళ్లేంటి అని వద్దు అన్నాడు మార్క్స్ నాన్న. కానీ జెన్నీ వాళ్ళ ఇంట్లో ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ మాత్రం చేసుకున్నారు. అప్పుడు మార్క్స్ కి 18, జెన్నీ కి 22 ఏళ్లు ఉండి ఉంటాయి.
తిరిగి కాలేజ్ కి వెళ్ళడానికి కనీసం ఐదు ఆరు రోజులు పడుతుంది. తిరుగు ప్రయాణంలో ఉన్నపుడే మార్క్స్ వాళ్ళ నాన్న Tb తో చనిపోయాడు. కానీ ఈ విషయం కాలేజ్ చేరుకునే దాకా మార్క్స్ కి తెలియదు. అప్పుడు తిరిగి వెళ్ళడానికి డబ్బులు కూడా లేక ఇంక వెళ్ళలేదట. తర్వాత కూడా కాలేజ్ ఫ్రెండ్స్ దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు అప్పు గా తీసుకొని లగ్జరీయోస్ గా స్పెండ్ చేసేవాడు, తాగుడు, హెగెలియన్స్ తో తిరగడాలు చదువుని బాగా దెబ్బ తీశాయి. ఈ చదువుకి ఎలాగో ఉద్యోగం రాదని మానోడికి అర్థం అయిపోయింది. అమ్మ ఉత్తరాలు రాసేది, “చూడు బాబు మీ నాన్న ఆస్తి పాస్తులేం పెద్దగా లేవు, ఒక చిన్న పండ్ల తోట తప్ప ఇంకేం కూడ పెట్టి ఇచ్చి వెళ్ళలేదు, నువ్వైనా జాగ్రత గా డబ్బులు ఖర్చుపెట్టుకోవడం నేర్చుకో. ఇక్కడ నీ తమ్ముడ్లను చెల్లెళ్లని కూడా నేనే సాకాలి. నువ్వు కాస్త ఆ చదువు అయిపోగానే ఏమైనా మంచి ఉద్యోగం వెత్తుకుంటేనే నాకు, వీళ్లకి ఒక ఆధారం దొరుకుతుంది. ఇప్పుడు నీకు బాధ్యతలు పెరిగాయి, జెన్నీ కూడా నీకోసం ఎదురు చూస్తోంది” అని. ఎప్పటికప్పుడు గర్ల్ ఫ్రెండ్ జెన్నీ కూడా ఉత్తరాలు రాసేది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉండి ఎంగేజ్మెంట్ అయ్యాక ఏడు సంవత్సరాలకి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. మార్క్స్ వాళ్ళ తరపున ఎవరు రాలేదంట. పెళ్లికి జెన్నీ వాళ్ళ అమ్మ, అన్నయ్య, తమ్ముడు ఇంకొంత మంది దగ్గరి ఫ్రెండ్స్ తో సింపుల్ గా ఒక చర్చ్‌లో జరిగింది. జెన్నీ ముందు నుండే మార్క్స్ కి చాలా సపోర్టివ్ గా ఉండేది, మార్క్స్ కూడా జర్నలిజం వైపు వెళ్లాక వివిధ ఇబ్బందుల్లో చిక్కుకొని చాలా కష్టాలు పడ్డాడు.
చదువు పూర్తి కాగానే ప్రష్యాలోనే ఒక న్యూస్ పేపర్ కి జర్నలిస్ట్ గా కుదురుకున్నాడు. అక్కడ ఆరు నెలలు కూడా చెయ్యక ముందే గవర్నమెంట్ కళ్ళలో పడి, మార్క్స్ పొలిటికల్ వ్యూస్ గవర్నమెంట్ ని ప్రశ్నిస్తూ, ఒక టెర్రరిస్ట్ లా వ్యాసాలు రాస్తున్నాడని పేపర్ని మూసేశారు గవర్నమెంట్. ఉన్న ఉద్యోగం పోయింది. అప్పట్లో పారిస్‌లో ఇంత కఠినంగా పరిస్థితులు ఉండకపోవడంతో జర్మనీ కన్నా పారిస్ మచ్ బెటర్ అనుకోని వలస వెళ్లాడు మార్క్స్. మార్క్స్ రాసే విధానం చూసి surprise అయ్యి పారిస్ లో ఒక న్యూస్ జర్నల్ స్టార్ట్ చేద్దామని కొంతమంది రిచ్ పీపుల్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి ముందుకొచ్చారు. ఉద్యోగం లేని మార్క్స్ కి ప్రష్యన్ గవర్నమెంట్ ఒక ఆఫర్ ఇచ్చింది. వీడిని ఇలాగే వదిలేస్తే ఇంకెన్ని రాచకార్యాలు చేస్తాడో, వీడి అడ్డు తొలగించుకోవాలంటే ఒక గవర్నమెంట్ సర్వీస్ ఇచ్చి నోరు మూపిద్దాం అనుకుని పెద్దవాళ్ళు, మార్క్స్ నాన్న ఫ్రెండ్ తో రాయబారం పంపించారు. మీ నాన్న గారి ఉద్యోగం నీకు ఇస్తానంటున్నారు అని ఆయన చెప్తే మార్క్స్ “వద్దు, నేను చెయ్యను” అని రిజెక్ట్ చేశాడు. అప్పటికే హెగెల్ థియరీకి అగైన్స్ట్ కూడా అయ్యాడు. ముందు ఏదైతే నచ్చి ఫాలో అయ్యాడో దాన్నే తర్వాత కాంట్రాడిక్ట్ చేశాడు. Thesis, Antithesis, synthesis అంటూ కాంట్రడిక్షన్స్ బైటపెడుతూనే ఉన్నాడు. పెళ్లైక హనీమూన్‌కి వెళ్ళమని అత్తగారు డబ్బులిచ్చి స్విట్జర్లాండ్ కి పొమ్మంటే మార్క్స్ ఒక రెండు మూడు పెట్టలనిండా పుస్తకాలు తీసుకెళ్లాడట. పారిస్‌లో జర్నల్ స్టార్ట్ చేస్తాం అని ముందుకొచ్చిన ఇన్వెస్టర్స్ తో నేను రెడీ అని చెప్పాడు మార్క్స్. అప్పటి దాకా మార్క్స్ ఒక్కడే విచ్చలవిడి గా ఖర్చుచేసే వాడనుకున్నాడు, హనీమూన్ లో భార్య జెన్నీ కూడా తనకేం మించిపోలేదని, కనీసం రాడానికి కూడా డబ్బులు లేకుండా ఖర్చులు పెట్టుకున్నారు. ఫ్రెండ్స్ కొంత పంపిస్తే వెనక్కి వచ్చారు. రాగానే అన్నీ రెడీగా ఉండడంతో భార్యతో మార్క్స్ పారిస్ చేరుకున్నాడు. అక్కడ ఒకేఒక వ్యాసం మొదటిది చివరిది అయింది, మేమింక ఇలా డబ్బులు పెట్టలేము అని వాళ్లు క్విట్ అయ్యారు. మార్క్స్ కి ఇల్లు లేదు, జెన్నీ ఏడూ నెలల ప్రెజ్ఞాన్ట్. పైగా ప్రష్యన్ గవర్నమెంట్ పారిస్ గవర్నమెంట్ తో మంతనాలు నడిపి మార్క్స్ ని అక్కడి నుండి పంపించే ప్రయత్నాలు కూడా చేస్తుంది. అసలే కష్టాలలో ఉన్న మార్క్స్ కి ఇదొకటి మధ్యలో. లక్కీగా ప్రష్యాలో జర్నలిస్ట్ గా చేసిన న్యూస్‌పేపర్ వాళ్లు మార్క్స్ కి కొన్ని డబ్బులు పంపారు, తను అక్కడ పని చేస్తున్నపుడు వచ్చిన లాభాల్లో వాటా లాంటిదేదో. సమయానికి ఆ డబ్బులే అవసరపడ్డాయి. అంతలో జెన్నీ కి అమ్మాయి పుట్టింది. ఇద్దరికీ పిల్లని చూసుకోవడం తెలియక ఆపసోపాలు పడేవాళ్లు, పాపకి కూడా బాగుండేది కాదని బలవంతంగా జెన్నీకి ఇష్టం లేకపోయినా ప్రష్యాలోని జెన్నీ వాళ్ళ అమ్మ దగ్గరికి పాపని ఇచ్చి పంపించాడు మార్క్స్. ఇలాంటి పరిస్థితిలో ససేమిరా మొగుడిని వదిలి వెళ్లడం ఇష్టం లేకపోయినా పాప హెల్త్ ని దృష్టిలో పెట్టుకొని నెల వయసు ఉన్న చిన్న బిడ్డని తీసుకొని బయలుదేరింది జెన్నీ. అప్పుడు ప్రష్యాలో కార్మికుల తిరుగుబాటు గట్టిగా జరుగుతుంది. ఈ విషయాలన్నీ భర్తకి ఉత్తరాల్లో ఎప్పటికప్పుడు జెన్నీ రాసేది. జర్మనీలో జరిగే విషయాల గురించి ఉద్రేగంతో ఊగిపోతూ ఇంటెన్స్‌గా వ్యాసాలు రాయడం మొదలుపెట్టాడు మార్క్స్. ఒక్కసారి ప్రష్యన్ రాజు మీద దాడి జరిగింది, ఎవడు చెయ్యడానికి పాల్పడ్డాడో వాడిని వెతికి ఉరి తీయమని ఆర్డర్స్ జారీ చేశారు, ఈ విషయం కూడా ఉత్తరంలో రాసింది జెన్నీ. ఇలా మన దేశంలో జరిగే సంగతులు బైటికి ఎలా పాకుతున్నాయి అని నిఘా మొదలైంది . ఆకాశ రామన్న ఉత్తరంలాగా “A girl from Prussia/Germany” అని వ్యాసం చివర్లో యాడ్ చేసేవాడు. పారిస్‌లో పబ్లిక్ మీటింగ్స్ కి వెళ్లడం, ఆక్టివ్ మెంబెర్‌గా ఉండడం మొదలైంది. ఇదే సమయంలో ఏదో పని మీద పారిస్ కి వచ్చిన Engels కూడా మార్క్స్ ని కలిశాడు,మార్క్స్ రాసిన వ్యాసాలు చదివి ఊగిపోయినంత పని చేసాడు. Engles కి వంశపారపర్యంగా ఆస్తులు ఉన్నాయి, ఒక కాటన్ మిల్ ఉంది. దానికి వాళ్ళ నాన్న ఎం.డి కూడా. Engels కి బుద్ధి తెలిసినప్పటి నుండి కాస్త ఆబ్సర్వ్ చెయ్యడం మొదలుపెట్టాడు, చైల్డ్ లేబర్, వాళ్ళ పని ప్రాంతాలు, కార్మికులకి జరిగే అన్యాయాలు అంటూ వ్యాసాలు రాయడం మొదలుపెట్టాడు. బాబుని వదిలేస్తే చేతికి రాకుండా పోతాడాని వాళ్ళ కొంపనిలోనే ఇంటర్న్ లా జాయిన్ చేశారు, తన తండ్రి కంపెనీలో తననే ఎంట్రీ లెవెల్ ఎంప్లాయ్ గా చేర్చుకున్నారు. ఇంకేముంది పెనం మీద నుండి పొయ్యిలో పడినట్టు ఏకంగా దగర నుండి కార్మికుల ఇబ్బందులు చూడడం, వాళ్లకి సపోర్టు గా నిలబడి యాజమాన్యం మీద ప్రొటెస్టులు, మీటింగ్‌లు, మీసాలు పెంచుకొని మిగితా కార్మికులతో తిరుగుబాటు తనాన్ని మొదలుపెట్టాడు. ఇలా అయితే ఇంకేం చేయలేమని కొన్ని రోజుల కోసం దూరంగా ఉంచడానికి వేరే దేశంలో ఉన్న తమ వ్యాపారాలు చూసుకోమని పంపించారు వాళ్ళ పేరెంట్స్. అప్పుడే మార్క్స్ ని కలుసుకుని ఫరెవర్ ఫ్రెండ్షిప్ కి రూట్స్ నిర్మించుకున్నాడు. ప్రష్యా నుండి వచ్చాక జెన్నీ కి మొత్తం చెప్పాడు మార్క్స్, జెన్నీ కూడ కాస్త రిలాక్స్డ్ గా ఫీల్ అయింది, మార్క్స్ కి కంపెనీ దొరికింది, ఇంకెవరో కూడా ఉంటారు సపోర్ట్ చెయ్యడానికి అని. అప్పుడే సినిమాలో దొంగలు పడ్డట్టు, ప్రష్యా గవర్నమెంట్ పారిస్ మీద ప్రెషర్ తీసుకొచ్చింది. అర్ధరాత్రి పోలీసులు మార్క్స్ ఇంటికి వచ్చి ఉత్తర్వులు జారీ చేశారు, నెక్స్ట్ 24 హార్స్ లో దేశాన్ని వదిలి వెళ్లిపోమని. లేపోతే హామీ పత్రం మీద ఇంక పారిస్ లో ఉన్నంతకాలం పొలిటికల్ ఆక్టివిటీస్ కి ఏమి అగైన్స్ట్ గా రాయను అని రాసి, సంతకం చేసి ఇవ్వమని. తెలిసిందే కదా నేను చచ్చినా హామీ పత్రం ఇవ్వను అని పెళ్ళాన్ని బిడ్డని పారిస్ లోనే వదిలి మార్క్స్ ఒక్కడే బ్రస్సెల్స్ చేరుకున్నాడు. అతి తక్కువ డబ్బులతో బయలుదేరి అక్కడ తిరిగి ఎక్కడ పడితే అక్కడ ఉంటూ, సిటీ కి కాస్త చివర్లో ఒక చిన్న ఇల్లు రెంట్ కి తీసుకున్నాడు. వెళ్ళేటప్పుడే తన దగర ఉన్న 250 ఫ్రాంక్స్ జెన్నీ కి ఇచ్చి వెళ్లి ఇల్లు వెతికి ఉత్తరం రాస్తాను అప్పుడు రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. ఉన్న డబ్బులు ప్రస్తుతం ఉన్న ఇంటికి అద్దెకు కూడా సరిపోవు, ఇంట్లో ఉన్న సామాన్లు, బట్టలు అన్నీ అమ్మి జెన్నీ పేమెంట్స్ క్లియర్ చేసి మార్క్స్ వెళ్లిన రెండు వారాలకు బ్రస్సెల్స్ వెళ్ళింది. పారిస్ కి బ్రస్సెల్స్ ఇంటికి చాలా తేడా ఉంది. అది పెద్ద మెట్రోపాలిటన్ సిటీ ఇది అలా కాదు. జర్మనీ నుండి Engels అండ్ ఫ్రెండ్స్ కొంత మంది కలిసి ఒక వెయ్యి ఫ్రాంక్‌లు పంపించారు మార్క్స్ కి. ఇవి ఇప్పుడు ఇక్కడ ఆరు నెలలకి అద్దెకి సరిపోతాయి అనుకున్నాడు మార్క్స్. బ్రస్సెల్స్ లో ఇంకా ఎలాంటి మూవ్మెంట్ స్టార్ కాలేదు, చిన్నా చితక పనులు చేసుకునే వాళ్లు, కార్మికుల మధ్య ఉంటున్నారు. ఇక్కడ ఎలాంటి హడావిడి లేదు. Engels లెటర్స్ రాస్తుండే వాడు మార్క్స్ కి.
To be continued again