Camp
Easy Rider (1969)
పాత పోస్టే, నాకు ఇష్టమైన ఎప్పటికైనా ఎత్తేయాలి అనుకునే సినిమా, అందుకే మళ్ళీ పోస్టింగ్
Well, that’s what happened to America – Liberty became a whore and the whole country took an easy ride – Peter Fonda
Late 60sలో అలజడితో రగిలిపోతూ,collapse దిశగా వెళ్తున్న అమెరికన్ సమాజానికి యువత దూరమవుతూ music, drugs & hippy life వైపు వెళ్తున్న టైంలో వచ్చిన సినిమా ఇది.ఇందులో రెండు ప్రధాన పాత్రలు వాళ్ళ దగ్గర ఉన్న డ్రగ్స్ అమ్మేసి,నగరాన్ని వదిలేసి,Mardi Gras ఈవెంట్ కి bikes మీద బయలుదేరటంతో సినిమా మొదలవుతుంది. ఓపెనింగ్ లో ఎయిర్ పోర్ట్ వెనక జరిగే transaction సీన్ ఒక్కటి చాలు,సినిమా మొత్తం చూసే ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది.BORN TO BE WILD songతో మొదలయ్యే bike ride 1969 లోకి తీసుకెళ్ళిపోతుంది.
ఈ సినిమా వచ్చే టైం కే “biker films” craze peek లో ఉంది.కానీ ఇది అన్ని ఫిల్మ్స్ లాంటిది కాదు,దీంట్లో bikers ఇద్దరు ఎలాంటి సాహసాలు చేయరు, పెద్ద targets కూడా ఏమి ఉండవు,సినిమా beginning లోనే peter fonda watch తీసి విసిరేయడం… just beautiful ….
Road films లో ఒక గొప్పదనం continuousగా terrain మారిపోతుంటుంది, ప్రతి సీన్ లో ఒక కొత్త లొకేషన్,కొండలు గుట్టలు ఎడారులు,Horizon లో కలిసిపోయే రోడ్లు,painting లాంటి sunset లు,road పక్క బార్లు,రాత్రి పూట rest తీసుకుంటున్నపుడు చలి మంటలు,కీచు రాళ్ళ,కొత్త మనుషులు,సంస్కృతులు…. కొంచెం ఎక్కువైంది,కానీ తప్పదు.. రోడ్ ఫిల్మ్స్ లో ఉన్న excitement అది. Easy రైడర్ గురించి రాయటం మొదలుపెట్టాక ఏం రాయాలో అర్ధం కాలేదు. అంత రాయొచ్చు ఈ సినిమా గురించి.
ఈ సినిమా కూడా స్వతంత్ర సినిమానే,పూర్తిగా వ్యక్తుల కలయిక వల్లే సాధ్యమైన సినిమా. ఒక పెద్ద దర్శకుడితో గొడవ పెట్టుకుని Hollywood లో blacklist అయి,Underground సినిమాకి పరిమితమైన Dennis Hopper దర్శకుడు. తండ్రి Henry Fonda వారసత్వంగా అందించిన అద్భుతమైన కమర్షియల్ సినిమా career వద్దు అనుకుని చిన్న సినిమాల్లో నటిస్తున్న Peter fonda ఈ సినిమా కి నిర్మాత. వీళ్ళిద్దరే ప్రధాన bikers పాత్రలు కూడా.
Bikers,Sex & Drugs ఈ theme తో అప్పటికే చాలా సినిమాలు వస్తున్నాయి,కాని ఇది Ultimate Biker Movie అవుతుందని Fonda & Dennis నమ్మకం.ఆ నమ్మకం తోనే డబ్బుల కోసం ప్రయత్నిస్తే, “freedom” కోసం వెతికే ఇద్దరు bikers అనే కథకి డబ్బులు పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు.THE MONKEES అనే tv షోతో success అయిన Bert schneider పెట్టుబడి పెట్టాడు.
There were a lot of drugs around the set. There’s no secret about that – Laszlo Covacs, D.o.P
Easy Rider షూటింగ్ జరిగిన అన్ని రోజులు యూనిట్ లో ఎవరికి కావాల్సిన డ్రగ్స్ వాళ్లకి దొరికేవి,పనిచేస్తున్న అందరూ డ్రగ్స్ తీసుకుని పని చేసేవాళ్ళు ఒక్క డైరెక్టర్ Dennis Hopper తప్ప.ఎందుకంటే అతను తాగుబోతు,మందు మాత్రమే తాగేవాడు.1969లో అమెరికాలో డ్రగ్స్ ప్రభావం అలాంటిది.ప్రతి రోజూ గొడవలే,చిన్న చిన్న accidents, first schedule చేసి నచ్చక ఆపేద్దాం అని కూడా అనుకున్నారు.యూనిట్ లో అందరితో Dennis Hopper కి గొడవలే.ఒకోసారి అతని ప్రవర్తన భరించలేని స్థాయికి వెళ్ళినా షూటింగ్ మాత్రం ఆగేది కాదు.తన విపరీత ప్రవర్తనకి కారణం ఒక “special film” తీయాలి అనే తపన.
Independent Cinema కి అతి పెద్ద బలం నమ్మకం,కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తున్నపుడు పనిచేస్తున్న వాళ్ళందరూ మూర్ఖపు నమ్మకంతో పని చేయాలి.
“And someday it was inevitable that a great film would come along, utilizing the motorcycle genre, the same way the great Westerns suddenly made everyone realize they were a legitimate American art form, ‘Easy Rider’ is the picture.” -Roger Ebert, 1969.