నీకు వేయటం వచ్చా?
నేనూ వాడు full bottle kyron brandy తెచ్చుకుని చెరో మూడు పెగ్గులు తాగాం, ఆకలవుతోంది
నేను : food order పెట్టనా ఎత్తిపెట్టు దోశ నుంచి
వాడు : అరేయ్ వాడి దోశ అక్కడికెళ్లి తింటేనే బాగుంటుంది పద
నేను : ఇద్దరం తాగేసున్నాం అవసరమా ఇప్పుడు, అసలే friday night
వాడు : మామా నేను తోల్తా బండి, అయినా నేనెప్పుడైనా పోలీసులకి దొరికానా
నేను : పోలీసులు అని కాదురా తాగి బండి తోలటం అవసరమా
వాడు : నా పాటికి నేను మందు తాగుతుంటే నువ్వే ఎత్తిపెట్టు దోశ అన్నావ్, నాకు ఇప్పుడు అదే తినాలని ఉంది, నువ్వు వస్తే రా లేకపోతే నేను ఒక్కణ్ణే వెళ్లి నీకు కూడా తెస్తా
వాడు ఇంక నా మాట వినడని అర్ధమైపోయింది, ఒక్కణ్ణే పంపడం ఇష్టం లేక నేనూ బయలుదేరాను, ఇద్దరం ఎత్తిపెట్టు దోశ కి వెళ్లి చెరొక మజ్జిగ మసాలాదోశ తిన్నాం, అది కూడా నా choice కాదు వాడి choice, నాకు plain దోశ మసాలాదోశ తప్ప ఇంకేం నచ్చవు, తాగి ఉన్నప్పుడు వాడికి ఎంత చెప్పినా వినడు అందుకే తినేసా. దోశ అనేదాన్ని సంక నాకిచ్చారు కదరా అనుకున్నా, దమ్ము కొట్టి బయలుదేరాం. గాలివాటపు speed లో రూంకి వచ్చి చెరో పెగ్ fix చేసుకున్నాం.
వాడు : (ఒక సిప్ వేసి) ఏముంది మామా మజ్జిగ మసాలాదోశ, ఎత్తిపెట్టు వాణ్ని కొట్టేవాడు లేడు రా
నేను : నాకు నచ్చలేదురా
వాడు : నచ్చ లేదా, నీది చాలా బ్యాడ్ టేస్ట్ రా
నేను : నీకు నచ్చింది కదా అని అందరికీ నచ్చాలా ఏంటి? దీనికే నువ్వు నా టేస్ట్ ని జడ్జ్ చేస్తావా
వాడు : అరే ఒక దోశ వేసి చూపియ్ అప్పుడు మాట్లాడు
నేను : నేనెందుకు దోశ వేయాలిరా
వాడు : దోశ వేయటం రానప్పుడు మరి మాట్లాడొద్దు
నేను : ఎర్రిపూకులా మాట్లాడొద్దు నాకు దోశ వేయటం రాకపోతే నేను నచ్చలేదు అని చెప్పకూడదా ?
వాడు : చెప్పకూడదు మామా, తెల్సా అసలు నీకు ఒక దోశ వేయటం వెనక ఎంత కష్టముంటుందో ?
నేను : వాడి కష్టం నాకెందుకురా నేనేమన్నా ఫ్రీగా తిన్నానా ? డబ్బులిచ్చి తిన్నా బాలేదు కాబట్టి నచ్చలేదు అంటున్నా
వాడు : మీరు చాలా తెలివైనోళ్లు అనుకుంటార్రా, వాడు అర్ధరాత్రి హోటల్ నడుపుతూ పోలీసులకి లంచమిస్తూ ఎంతమంది వచ్చినా అలాంటి దోశలు వేసిస్తుంటే బలుపురా మీకు, జస్ట్ ప్లేట్ పక్కన పడేసి నోటికొచ్చినట్టు మాట్లాడుతారు
నేను : అర్రే నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్ధమవుతోందా
వాడు : నీకే చిప్పులు దొబ్బాయి, ఒక దోశ హోటల్ పెట్టాలంటే ఎంత కష్టమో నీకు తెల్సా ? అసలు పిండి ఎలా పట్టాలో తెల్సా, ఒక రాత్రికి ఎన్ని వాయిలు పడతాయో తెల్సా, వాళ్ళ కష్టం నీకు…
నేను : ఇంక ఆపేయ్ రా ఈ టాపిక్
వాడు : ఏందిరా ఆపేది, దోశ పిండిలో ఉప్పు తేడా కొడితే ఏమవుతుందో నీకేం తెల్సురా, వాళ్ళ దోశ తిని మెచ్చుకోకపోయినా కనీసం వాళ్ళ effort కి respect ఇవ్వు
నేను : అదేమన్నా చారిటీనా రా జనాల దగ్గర డబ్బులు దెంగుతున్నాడుగా
వాడు : మామా వాళ్ళ గురించే అట్లా మాట్లాడితే మర్యాదగుండదు అయినా మీ intellectuals కి ఏం చేసినా నచ్చదు
నేను : దీనికి intellectual ఏందిరా, నీకు నచ్చిందా దోశ ?
వాడు : నాకు వాడి కష్టం నచ్చింది
నేను : నీలాంటోళ్ళు ఉండబట్టే వాడి ఏది పడితే అది మన మొహాన కొడుతున్నాడు
వాడు : అక్కడ్నుంచి order పెట్టమంది ఎవడురా, నువ్వే కదా, ఇప్పుడేమో కంప్లయింట్లు , అవునురా మాకు వాడి కష్టం అంటే ఇష్టం వాడి హోటల్ లో అంట్లు తోమే ఆంటీ కష్టం ఇష్టం కౌంటర్ లో కూర్చునే ముసలోడి కష్టమంటే ఇష్టం పార్కింగులో సెక్యూరిటీ వాడి టోపీ ఇష్టం అంతమందికి జీతాలిస్తున్న ఓనర్ కష్టం వెనకున్న కష్టం మీలాంటి నికృష్టలకి అర్ధంకాదు, మీలాంటివాళ్ళ వల్లే మన తెలుగు దోశ ఇండస్ట్రీ ఇలా ఏడ్చింది
నేను : దోశ గురించి చెప్పరా అంటే సొల్లు వాగుతావేంది బే
వాడు : pan india మన దోశని ప్రేమిస్తుంటే మీలాంటోళ్ళకి కుళ్ళురా
నేను : ఆపరా, నువ్వూ నీ దోశ ప్రేమ
వాడు : శ్రీశ్రీ ఊరికే అనలేదురా ఎంత కష్టం ఎంత కష్టం
నా సహనం నశించింది నా చేతిలో గ్లాసు వాడి తల మీద పగిలింది, నేనే హాస్పిటల్ కి తీసుకెళ్ళి కుట్లు వేయించా, ఇంకొక్కసారి ఇలాంటి ఎర్రిపూకుతో దోశ తినడానికి వెళ్ళకూడదు వెళ్లినా దాని గురించి డిస్కషన్ పెట్టకూడదు అని decide అయ్యా .
నా ‘దోశ రాత’ నచ్చితే buy me a దోశ & కాఫీ , కింద qr code ఉంది