చిన్న సినిమా future ఏంటి?
Stars లేకపోతే సినిమాకి జనాల్ని theatre కి రప్పించడం కష్టం, ఇదేం కొత్తగా వచ్చిన సమస్య కాదు, ఆదిమానవుల కాలం నుంచి ఇదే తంతు. అక్కడే చిన్న సినిమా అనేది తన ప్రత్యేకతని చూపించేది, stars లేకుండా ధైర్యం చేసి సినిమా చేయడం అనేదే దర్శక నిర్మాతలకి excitement, low budget లో మనమేదో కొత్తగా చేయబోతున్నాం అనే ఆలోచనే ముందుకి నడిపించేది, ప్రేక్షకులకి కూడా ఇలాంటి సినిమాల్లో ఏదో కొత్తగా చూస్తాం అనే ఆశ. కానీ ప్రేక్షకులు ఇప్పుడు రావడం లేదు, దీని గురించి discussion ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే కొన్ని సంవత్సరాల నుంచి టికెట్ రేట్లు కావచ్చు, ప్రేక్షకులు enjoy చేసే “చిన్న సినిమా” రాకపోవడం కావచ్చు, especially కరోనా తర్వాత చిన్న సినిమా ఇంక తట్టుకోవడం కష్టం అనే పరిస్థితి వచ్చేసింది. ఇంతలా కాకపోయినా ఇలాంటి సినిమా survive అవడానికి ఎప్పుడూ కష్టపడుతూనే ఉంది. అప్పుడప్పుడు వచ్చి హిట్ అయ్యే ఒక్క చిన్న సినిమా ఇంకో ఇరవై సినిమాలు మొదలవటానికి “ఉత్సాహం” ఇస్తూనే ఉంటుంది.
ఇప్పుడేమన్నా చిన్న సినిమాల production తగ్గిందా అంటే లేదు, రోడ్ల మీద తిరుగుతుంటే ఎన్ని పోస్టర్లు, విచిత్రమైన titles, ప్రేక్షకుడిని థియేటర్ కి attract చేసి రప్పించేదే title కాబట్టి ఎన్నో వింత titles కనిపిస్తుంటాయి. ఇవన్నీ ఏమైపోతున్నాయి? చాలా వరకు రిలీజ్ అయితే అవుతున్నాయి, రిలీజ్ అయితేనే OTT తీసుకుంటుంది అనే ఆలోచనతో చాలా కష్టాలుపడి రిలీజ్ చేస్తున్నారు. మేమూ శీష్ మహల్ రిలీజ్ కి అలానే try చేసాం, వాళ్ళు చెప్పినవి విని మా దగ్గర అంత డబ్బులు లేక ప్రస్తుతానికి ఆ ఆలోచన పక్కన పెట్టాం.
OTT లు కూడా ఈ low budget సినిమాలు కొనడం లేదు, pay per view పద్ధతిలో వాళ్ళ platform మీద పెడతాయి, ఒక ప్రేక్షకుడు సినిమా గంట పైన చూస్తే ఇన్ని రూపాయలు, for example సినిమా మొత్తం చూస్తే 4-8 రూపాయల మధ్య offer ఉంటుంది. అంటే ఒకవేళ పదిలక్షల మంది నా సినిమా చూస్తే 50-80 లక్షల మధ్య రావచ్చు. Low budget సినిమా అంటే కోటిన్నర రెండు కోట్ల కి వెళ్ళిపోయింది, so ఆ డబ్బులు recover కావాలంటే అదొక long term ప్రాసెస్. నేను చెప్తున్న ఈ లెక్క కూడా అంత accurate ఏం కాదు. నాకు ఎవరో చెప్పింది, అసలు film ఇండస్ట్రీలో ఏదీ అంత clear గా transparent గా ఉండదు. Even నీకు బాగా తెల్సిన producer కూడా తను ఎంత పెట్టాడు తనకి వచ్చిన offer ఏంటి, ఎంత recover అయిందో చెప్పడు, ఎందుకలా అంటే అది కూడా ఆదిమానవుల నాటి తంతే, నిజం చెప్పొద్దు.
పెద్ద సినిమాలు కొంచెం satisfy చేసినా జనాలు happy కానీ medium range & low budget సినిమాల్లో ఏదో కొత్తగా ఉండాలి, కరోనా టైంలో OTT లో చూసిన other language films తో comparison వచ్చేసింది. తమిళ్ మలయాళం కొరియన్ వాళ్ళలా మనమెలా తీయగలం ? కష్టమే,సాహిత్యం లాగే సినిమాకి కూడా “experimental past” ఉండాలి, ఆ రకంగా చూసుకుంటే మన సినిమా అలాంటి realistic cinema వైపు వెళ్ళింది తక్కువే. మనది చాలా glamorous cinema లేదా heroic cinema. బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతోడూ హీరోనే, గాల్లోకి పదిమందిని లేపాలి లేదా ప్రేమలో పడి అమ్మాయిని వెంటాడో వేధించో సాధించుకోవాలి, ఆ హీరోయిన్ అనే పిచ్చిమాతల్లి రంగురంగుల బట్టలు మేకప్ వేసుకుని తిరుగుతుండాలి. అన్నీ అలానే ఉంటున్నాయని అనటం లేదు, కానీ majority films అవే, సినిమా చూడక్కరలేదు పోస్టర్ చూసి చెప్పేయొచ్చు ఇది అలాంటి సినిమానే అని. Experimental or new idea అనేవి భరించలేనంత వింత కథలతో వస్తాయి, అవి idea వరకే interesting మిగతాదంతా తూచ్.
మరి చిన్న సినిమా future ఏంటి ?
ఖచ్చితంగా ticket రేట్లు పెద్ద సమస్య, వందల కోట్ల సినిమాకి రెండు కోట్ల సినిమాకి ఒకటే టికెట్ అంటే ఎలా? కనీసం ఇప్పుడు ఏదో flexible ticketing పద్ధతిలో కొన్ని చిన్న సినిమాల టికెట్ రేట్లు బానే తగ్గిస్తున్నారు. కానీ దీనికి ఒక policy అంటూ ఏం లేదు, రిలీజ్ చేసేవాడి capacity ని బట్టి నడుస్తోంది.
సినిమా range ఎంత అనేది పక్కనపెడితే అన్నిటికీ ఒకటే రకమైన publicity template, అన్నిటికీ Audio release , pre release, posters, hoardings, ఇంకా ఏవేవో, ఇవి కాకుండా result తో సంబంధం లేకుండా అన్ని websites లో blockbuster banners. “Promotions budget” సినిమాని బట్టి మారుతుందేమోగాని template అదే, పెద్ద సినిమా ఏం చేస్తే అది చిన్న సినిమా వాడు కూడా చేయాల్సిందే, లేకపోతే రిలీజ్ కష్టం అని భయపెట్టే pattern ఒకటైతే, ఆ చిన్న సినిమాల వాళ్లకి కూడా ఇవన్నీ చేయాలి అనే ఉత్సాహం. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు కరెక్ట్ అయుండొచ్చు.
నా ఉద్దేశం లో నాకే personal capacity లో ఒక low budget సినిమా మీద control ఉంటే promotion మొత్తం online చేస్తా, ఒక్క poster వేసినా డబ్బులు వేస్టే, వారం కాదు కదా మూడు నాలుగు రోజులు కూడా ఉండని poster మీద ఎందుకు ఖర్చుపెట్టాలి. పెద్ద హీరో సినిమాకి అంటే fans గొడవల నుంచి producer prestige దాకా ఎన్నో ఉంటాయి, వాళ్ళు పోటీలు పడి చేసుకోవడంలో వేరే లెక్కలు అవి. ఒకవేళ మా సినిమా ఏదన్నా రిలీజ్ దాకా వస్తే, traditional గా జరగాల్సినవి అన్నీ జరుగుతాయి, ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు, నేనేం చెప్పినా వినరు. ఆ stage కే వస్తే ప్రతి రూపాయి online లోనే ఖర్చుపెడతా, result సంగతి తర్వాత, నా సినిమాకి ఇలాంటి publicity అవసరం లేదు, ఈ మాట నేను 2015 నుంచి మాట్లాడుతున్నా, పిచ్చోణ్ణి చూసినట్టు చూసారు చూస్తున్నారు, అందుకే ఇలా ఉండిపోయానేమో.
నేనూరోహిత్ కూడా పెళ్లిళ్లు లంగా ఓణీలు పంచెలు ఆడియో రిలీజుల ప్రీ రిలీజుల function ల గురించి ఆలోచించి ఉంటే జీవితంలో సినిమాల్లో success అయ్యేవాళ్ళమేమో.
ఎన్ని చిన్న సినిమాలు ప్లాప్ అయినా, మళ్ళీ మళ్ళీ తీయడానికి నిర్మాతలు వస్తూనే ఉంటారు, ఈ చిన్న సినిమాతో first step వేసి ఆ తర్వాత ఇండస్ట్రీ ని shake చేసే సినిమాలు తీద్దాం, ప్రతి “బాబు” తో ఒక సినిమా చేసేద్దాం అని కలలు కనేవాళ్ళు చాలా మందే ఉన్నారు, ఉంటారు ఎప్పటికీ. So గుడ్డిగా చిన్న సినిమా కి future ఉంటుందని నమ్మేయటమే.
నా రాత నచ్చితే కింద qr code ఉంది, buy me a drink or coffee bro.