Reviewers

రివ్యూలోళ్ళు


“సినిమా రివ్యూ రిలీజైన మూడు రోజుల తర్వాత పెట్టాలి”
సరిగ్గా గుర్తులేదు కానీ ఈ topic 10-12 ఏళ్ళ క్రితమో ఇంకా ముందో బానే discussion లోకి వచ్చింది, అప్పుడే అనిపించింది ఇదెలా సాధ్యం అని? ఎందుకు ఆగుతాడు ఎవరైనా మూడు రోజులు? ఎందుకు ఆగాలి? Urgent గా ప్రపంచానికి నేను చూసిన సినిమా మీద అభిప్రాయం చెప్పాలి అనే తాపత్రయం తహతహ ఇప్పటిది కాదు, ఇది దశాబ్దల క్రితమే మొదలైన సినీ ఆచారం, పిచ్చి, వెర్రి. టీనేజ్ లో కాలేజ్ ఎగ్గొట్టి మార్నింగ్ షో కి వెళ్ళి షో అయ్యాక ఫ్రెండ్స్ కి ఎపుడెపుడు సినిమా గురించి చెప్దామా అనే ఆత్రుత రివ్యూనే. సినిమా మీద  ఎవడి అభిప్రాయం కరెక్ట్ అని జరిగే గ్రూపు వాదనలు కూడా రివ్యూలే. మా రోజుల్లో సినిమా రిలీజైన వారానికో మూడో రోజైన ఆదివారం రోజో రివ్యూస్ వచ్చేవి. Magazine చేతిలో పడగానే ఫస్ట్ రివ్యూ పేజికే, గుడిపూడి శ్రీహరి ఏం రాసాడు? నేను అనుకున్న దానికి దగ్గరగా ఉందా లేదా అని curiosity. నాకు పేరు గుర్తున్న సినిమా విమర్శకుడు ఆయనొక్కడే. రివ్యూల వల్ల రెండో వారంలో పికప్ అయి వందరోజులు ఆడిన సినిమాలు ఎన్నో, అలాగే రివ్యూలకి అతీతంగా ఆడేసిన సినిమాలు చాలానే ఉండేవి.


రివ్యూల ప్రభావం సినిమా రిజల్ట్ మీద ఉండకుండా ఎలా ఉంటుంది ?  ఒక ఫ్రెండ్ మాట విని పది మంది సినిమా చూడటం మానేసేవాళ్ళం, అప్పట్లో వాడొక influencer వాడొక reviewer. వచ్చే కొత్త టెక్నాలజీ అంతా వాడుకుంటూ రివ్యూలు ఆపాలంటే ఎలా? ఇంటర్నెట్ విప్లవంలో అత్యంత ముఖ్యమైన భావప్రకటనా స్వేఛ్చని కట్టడి చేయడం సాధ్యమా? Impossible. గుట్టలుగుట్టలుగా రివ్యూ రచయితలు పుట్టుకొస్తూనే ఉంటారు, అందరం విమర్శకులమే, కొందరు రాస్తారు మరికొందరు మాట్లాడతారు. సినిమా అంటే అంత ఇష్టం అంత కోపం ధ్వేషం మన నరనరాల్లో ఇంకిపోయింది. సినిమా పిచ్చోళ్ళు మా తాతల రోజుల నుంచే ఉన్నారు, ఇప్పుడా పిచ్చి వేరే లెవెల్ కి చేరింది, ఊహకందని లెవెల్ ఇది. హీరోలని ఆరాధించడం సినిమాలని ప్రేమించడం అనేది రివ్యూ రచయితల్ని అమ్మలక్కల బూతులు నుంచి నరికేస్తాం అని వార్నింగులు ఇచ్చేదాకా చేరుకుంది సినిమా పిచ్చి. అసలేం జరుగుతోంది దివాకరం అని మా విజయ్ అడుగుతుంటాడు? ఏమో ఏదో జరుగుతోంది రోజుకో రచ్చలా ఉంది. నేను రివ్యూస్ చదువుతా కొంతమంది వీడియోస్ చూస్తా, రాసిన రివ్యూలో bottomline ఏం రాసాడా అని చాలా curious నాకు , they are really funny yaar😜. అప్పుడప్పుడు వీడియో కింద కామెంట్స్ చదువుతా, అది మొదలైతే scroll down నడుస్తూనే ఉంటుంది, ఎంత creative comments & counter points ఉంటాయంటే, full discussions నడుస్తుంటాయి, ఎంత మజా వస్తుందో అంత shock కి కూడా గురి చేస్తాయి, కనిపిస్తే కొడతా నుంచి వేసేస్తా అనే వాళ్ళని చూసి రివ్యూయర్స్ మెదళ్ళు మొద్దుబారిపోయి ఉంటాయా లేక భయపడుతుంటారా? భయమయితే కనిపిస్తోంది. This is very sad, లేక నేను ఎక్కువ ఆలోచిస్తున్నానా? అంతులేని hate అయితే reviewers ఎదుర్కొంటున్నారు, తప్పదు, ప్రపంచం నడుస్తున్నదే ధ్వేషం మీద.


ఎక్కువగా కనిపించే కామెంట్ “thanks అన్నా నా డబ్బులు save చేసావ్” అని, రివ్యూ చూసి లేదా చదివి  వెళ్ళకపోవడం వల్ల డబ్బులు మిగిలిపోయాయి అనే ఆనందం ఎలా ఉంటుందో? రెండు బీర్లు తెచ్చకుని ఇంట్లో కూర్చుని ఏదైనా మంచి సినిమా పెట్టుకుని చిల్ అవ్వొచ్చు.  రివ్యూయర్ తప్పవచ్చు but నేను వాడి మాట నమ్ముతా అనుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు.


రివ్యూలు రాసే వాళ్ళని చెప్పేవాళ్ళని “సినిమా తీసి చూపించు” అనటమయితే big joke, ఇది old topic అయిపోయిందిలే. “వాళ్ళ కష్టం మీకు తెల్సా” is another joke, సినిమా తీయడం వెనక కష్టం అందరికీ తెల్సిందే, నాకు తెల్సి మా తాతకి కూడా తెలిసే ఉంటుంది. అది ఇష్టమైన కష్టం, ఒక short film నుంచి భారీ బడ్జెట్ దాకా అన్నీ కష్టమే. కష్టపడారనే జాలితో జనాలు సినిమాలు చూస్తే ఎన్ని డబ్బులో. ప్రేక్షకుడు effort ని అర్ధం చేసుకున్నప్పటికీ అది నన్ను entertain చేసిందా లేదా పైసా వసూల్ అయిందా లేదా is what ultimate. కష్టపడి తీసాం కాబట్టి కొంచెం పాజిటివ్ గా రాయొచ్చుగా అని దర్శక నిర్మాతలు ఆశించడం తప్పు కాదేమో గాని అది జరగదు. ముందుముందు మరింత brutal reviews కి సిధ్దపడే సినిమా తీయాలి.


ఈ పదేళ్ళలో మా సినిమాల మీద కామెంట్స్ చూసి hurt అయి కోపం వచ్చే stage నుంచి జోక్స్ వేసుకుని నవ్వుకునే దాకా మెచ్యూర్ అయాం, మంచి మార్పే. One line comment is a review నా వరకు, రివ్యూయర్స్ మంచిదో చెడ్డదో ఒక discussion create చేస్తారు, అది fun part. నచ్చితే follow అవుతా లేకపోతే ఇగ్నోర్ కొడతా. Reviewers కి అంత importance ఇవ్వాల్సిన అవసరం లేదు,  వాళ్ళ వల్ల సినిమాలకి నష్టం జరుగుతోందా అంటే అనివార్యమగు దాని గురించి నీవు చింతింపవలదు అని శ్రీకృష్ణుడు చెప్పింది గుర్తు చేసుకోవడమే.