మోహన్సార్

నిన్న రాత్రి నేనూ రమణ & రోహిత్ మందు తాగుతున్నాం రోహిత్ ఇంట్లో. అప్పుడప్పుడు అంటే ఎప్పుడూ రోహిత్ “రండి మీకొకటి చూపిస్తాను” అని జనాల్ని సినిమానందానికి గురి చేస్తుంటాడు. మేము తాగుతుంటాం రోహిత్ తన కంప్యూటర్ ముందుకెళ్ళి తను చేస్తున్న ఎడిట్ కావచ్చు తను పొద్దున్నే చూసిన సినిమాలో మైండ్ బ్లోయింగ్ సీనో రెడీ చేసి, ఉన్న జనాలందర్నీ పిలిచి చూపిస్తాడు, ఏప్రిల్ ఒకటి విడుదల సినిమాలో సాక్షి రంగారావు సీన్ గుర్తుందా? అలా చేస్తాడు రోహిత్, “ఇప్పుడు మీరొకటి చూడబోతున్నారు, మామూలుగుండదు” అని హైపిచ్చి play కొడతాడు, నిన్న కూడా అదే చేసాడు రొటీన్ గా. మోహన్ సార్ బర్తడే పార్టీ footage. ప్రకాష్ సార్ అన్నట్టు అదొక మినీ కళాకేంద్రం, సకలకళా వయసుల ఆర్టిస్టులు, కవులు కార్టూనిస్టులు, పాటగాళ్ళు బొమ్మలేసేవాళ్ళు, అదృష్టం దక్కిన మాలాంటి సినిమా గాళ్ళు, సామాన్య ఎంజాయ్ గాళ్ళు, ఇలాంటి పాతిక ముప్పై మంది ఒకచోట చేరి మోహన్సార్ బర్తడే celebrate చేసుకోవడం పండగే. 

మోహన్సార్ తో కలిసిన రోజులు రాత్రులు very special, ఆయన మేనల్లుడు రోహిత్ నా collaborator అవడం, ఇదంతా వాంఛిత యాదృచ్ఛికం, అదేంటని అడక్కండి. నేను ఇండీగా బతకాలనే క్రమంలో తగిలాడు రోహిత్ అక్కడ్నుంచి మోహన్సార్ పరిచయం. ఆయన కన్నా ఇండీ ఎవరుంటారు అనిపించింది కొన్ని రోజులు గడిపాక, తెలుగులో animation film తీయాలనే ప్రయత్నం చేసిన మొదటి వ్యక్తి ఆయనే కావచ్చు. ఎప్పటికప్పుడు కొత్తగా ఏదో చేయాలి అది కూడా సింపుల్గా చేయాలనే మోహన్సార్ ఒక గొప్ప inspiration. మనల్ని inspire చేసినవాళ్ళని కలవడం ఒక మర్చిపోలేని గొప్ప అనుభవం, మోహన్సార్ అలా అందరినీ కలిసి కలుస్తూ ఎంతమందికి మరపురాని అనుభవాలిచ్చాడో. 

నీ వయసు ఆయనకనవసరం, అందరూ సమానులే మోహన్ ఫ్లాట్ లో, అందరూ ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ఆయన సమక్షంలో, అత్యంత సుభిక్ష సమక్షం అది. టేబుల్ కి అటు పక్క డాన్ లా కూర్చుని అప్పుడప్పుడూ చెరగని తల దువ్వుకుంటూ పాటలు మాటలు వింటూ నవ్వుకుంటూ మురిసిపోయే మోహన్ ని చూస్తే కళాత్మక డాన్ అనిపిస్తాడు. సాఫ్ట్ గా మోహన్సార్ వదిలే one liners బ్లాస్టులే. 

నన్నూ రోహిత్ ని “మీరు పడవ మీద పాటలు తీసే filmmakers రా” అనేవాడు మోహన్సార్, అంటే మేము బెంగాలి ఆర్ట్ filmmakers టైపు అన్నది ఆయనుద్దేశం. “మేము అస్సలు ఆ టైపు కాదు సార్” అని సార్ తో గొడవ పెట్టుకునేవాణ్ణి. మా శీష్ మహల్ పాటలు అడిగి మరీ పెట్టించుకునే వాడు మోహన్సార్, ఈ ఆర్టికల్ కి పెట్టిన thumbnail లో  ఆయన మా శీష్ మహల్ ట్రైలర్ చూస్తున్నాడు. 

I don’t miss him, the days and nights I had spent with him matters to me.