ఖైరతాబాద్ నుంచి నెక్లెస్ రోడ్డు వైపు బైకు మీద బ్రిడ్జి దాటుతుంటే ప్రసాద్ మల్టిప్లెక్స్ reveal అవుతుంటే అద్భుతంగా అనిపించేది, అంత పెద్ద అద్దాల భవనం, దాని షేపు మరీ beautiful గా అనిపించేది. ఆ అద్దాల వెనక ఏముంది, లోపల ఏం జరుగుతుంది అనే curiosity తో దాని లోపలికి వెళ్ళాలి అనుకునే చెత్త ఏరుకునే కుర్రోడి కథే ‘శీష్ మహల్’ నాలుగు కథల్లో ఫకీర్ కథ. మా టైటిల్ వెనక కథ కూడా అదే, ప్రసాద్స్ కి మా tribute అది. మేము ‘శీష్ మహల్’ తీస్తున్నప్పుడు ప్రసాద్స్ “ celebrating 10 years of complete entertainment”, హైదరాబాద్ లో మొట్టమొదటి పూర్తి స్థాయి మల్టిప్లెక్స్ & ప్రపంచంలో ఉన్న అతి పెద్ద imax screens లో ఇదొకటి. Open అయిన కొత్తలో ఎన్ని విశేషాలో ప్రసాద్స్ గురించి,అన్నీ విశేషాలే. Enter అయిన దగ్గరనుంచి అదొక magic world లోకి enter అయినట్టుండేది. హైదరాబాద్ tourist attractions లో అదొకటయిపోయింది, గుట్టలు గుట్టలు జనం ఎప్పుడు వెళ్ళినా, కాస్త డబ్బులుంటే ప్రసాద్స్ కి వెళ్ళిపోయేవాళ్ళం.
ప్రసాద్స్ లో screens గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, sound & image quality top notch, seating most comfortable and theatre size is so perfect. ఎన్ని indie cinema లు వచ్చేవో, ఒక షో రెండు షోలు, ఏదీ వదిలేవాణ్ణి కాదు. ఒక్కణ్ణే వెళ్ళిపోయేవాణ్ణి, chicken sandwich & popcorn నాకు ఇప్పటికీ favourite. నా girlfriend తో చూసిన first cinema “Morning raga” అక్కడే, Horror house లోకి వెళ్ళి ఆ అమ్మాయి కన్నా ఎక్కువ భయపడి తన చెయ్యి గట్టిగా పట్టుకుంటే ఎలా నవ్విందో, ఎన్నో beautiful memories ప్రసాద్స్ తో. చుట్టాల పిల్లల్ని తీసుకెళ్ళే పనొకటి పడేది నాకు, వాళ్ళతో పాటు అన్ని games ఆడేవాణ్ణి, ఒక్క rock climbing తప్ప అన్నీ enjoy చేసా, ఇప్పుడు అది ఎక్కేంత కష్టం ఎందుకులే అని వదిలేసా.
Imax లోకి మొదటిసారి enter అయినపుడు దాంట్లో సినిమా చూసినపుడు కలిగిన అనుభూతి మాటల్లో వర్ణించలేను. Hyderabad లో ఇలాంటి world class entertainment ఉండాలి అన్న రమేష్ ప్రసాద్ గారి తపనకి దాన్ని నిజం చేసిన ఆయన effort కి hatsoff. Prasads కి మా శీష్ మహల్ లో ఇచ్చిన tribute ఆయనకి చూపించాలనుంది.
నాకెప్పుడూ ఒకటే కోరిక ఉండేది, ఉంది, ప్రసాద్స్ screen 5 లో శీష్ మహల్ ఒక్క షో గా అయిన రిలీజ్ చేయాలని, తీరుతుందనే ఆశ ఇప్పటికీ ఉంది. 20 ఏళ్ళ celebrations జరుపుకుంటున్న ప్రసాద్స్ లో పదేళ్ళ క్రితం తీసిన మా సినిమా రిలీజ్ అయితే అంతకన్నా నా life లో achievement ఏముండదు.