Money తీసి ముప్పై యేళ్లు అయిందని ఈ మధ్యే శివ నాగేశ్వర రావు, JD చక్రవర్తి, చిన్నతో ఒక ఇంటర్వ్యూ చేశారు సాక్షి వాళ్ళు. YouTube లో కనిపిస్తే చూడడం మొదలుపెట్టా. వాళ్ళు మాట్లాడుతుంటే, షూట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటుంటే విని, వెంటనే సినిమా చూడాలనిపించింది. YouTube లో విపరీతమైన ads వల్ల డౌన్లోడ్ చేద్దాం అనుకున్న, ఎక్కడ ఒక ప్రింట్ కూడా కనిపించలేదు. అమెజాన్ ప్రైమ్ లో ఉంది, చూడాలనుకుంటే.
చాలా మంది దీని RGV సినిమా అనుకుంటారు, చాలా రోజులు నేను అదే అనుకున్న. వర్మ స్టైల్ ఘోరాది ఘోరంగా కనిపిస్తుంది, ఒక కార్ మీద సినిమా ఓపెన్ అయ్యి, టైటిల్ కార్డ్స్ ఫినిష్ అవుతాయి. అదే వర్మ స్టైల్, సింపుల్, బ్యూటిఫుల్ అండ్ వెరీ మచ్ into the film, immediately, exactly like Varma’s “దెయ్యం”. దెయ్యం కూడా అంతే కారు షాట్లు, ఎంత వీలైతే అంత సింపుల్ షాట్లు, వెంటనే ఒక character నీ కార్లో ఎక్కించుకుంటారు ఫార్మ్ హౌస్ కి వెళ్తారు, అయిపోయింది, స్ట్రెయిట్ ఇంటు ఇట్.
Money సినిమా చాలా సార్లు బిట్స్ and పీసెస్ లో చూసాను,కానీ ఇలా పని కట్టుకొని కూర్చొని చూసి చాలా ఏళ్లైంది. కార్, మ్యూజిక్ అండ్ సిరివెన్నెల అండ్ సినిమా స్టార్ట్ అయింది. మళ్ళీ చూస్తుంటే కలుగుతున్న కంఫర్ట్ అంతా ఇంతా కాదు, హైదరబాద్ లో మన లాంటి ఇంకో సినిమా పిచ్చోడు తీసిన సినిమాలా అనిపిస్తుంది. ఇష్టం ఉన్న చోట్ల పాటలు, ఇష్టం ఉన్న కట్లు, ఎక్కడ పడితే అక్కడ, ఎవడి మీద పడితే వాడి మీద లిబరల్ గా వాడే లైట్స్, అండ్ JD హీరో లా debut, అసలు చిన్నా, జేడీ లు ఇద్దరు హీరోస్, కానీ మనకి జేడీ హీరో, ఎందుకంటే జేడీ హీరో కాబట్టి.
వర్మ సినిమాలో చిన్నా క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి, gentleman, understanding and very practical & educated characters వుంటాయి, రాత్రిలో కూడా అంతే, అందుకే వర్మ క్రియేషన్స్ లో ఉండే చిన్న చాలా స్పెషల్, always! హీరో అయిన జేడీ కి గర్ల్ ఫ్రెండ్ ఉండదు, అదే ఈ సినిమాకి చాలా అడ్వాంటేజ్. అనవసరమైన హీరోయిన్ angle వద్దనుకోడమే smart డెసిషన్. రేణుక సలుహ ఉన్న కూడా, చిన్నా గర్ల్ ఫ్రెండ్ అయినా కూడా, వీళ్ళ ఇద్దరితో తన ఫ్రెండ్షిప్ sensible గా ఉంటుంది, నార్మల్ జనాలు mostly అలానే ఉంటారు, ఏదో ఒక పండగకో, b’day రోజూ తప్ప ఎక్కువ డ్రామా చెయ్యరు.
ఎక్కడ పడితే అక్కడ షూట్ చేసుకోవడం, నచ్చినట్లుగా షాట్లు తీయడం, పర్ఫెక్షన్ కోసం పాకులాడకపోవడం, లిరిక్స్ అండ్ మ్యూజిక్ money సినిమానీ ఇంకా బ్యూటిఫుల్ గా, ఇంటరెస్టింగ్ గా మార్చాయి. ఖాన్ దాదా కనిపించిన ప్రతీసారి వచ్చే మ్యూజిక్, JD బ్రహ్మీ మీద అదే అదే close-up, dialogue, బ్రహ్మీ attitude, style ఎప్పటికీ హిట్టే. అంత సీరియస్ రోల్ లో బ్రహ్మీ నీ ఇమాజిన్ చేసుకోవడం అనేది నెక్స్ట్ లెవెల్ craziness. మనీ సినిమాకి స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ అన్ని శివ నాగేశ్వర రావే, అది ఆయన debut film.
ఎంత క్రేజీ గా ఉంటుందో అంత లిబరల్ గా కూడా ఉంటుంది, ఏ debut film maker కైన అంత ఫ్రీడమ్ అప్పుడే ఉంటుందేమో. అక్కడే వాళ్ళ స్టైల్, వాళ్ళ ఇంటరెస్ట్, అన్ని కనిపిస్తాయి. తర్వాత తర్వాత అవ్వని కమర్షియల్ అయ్యి, కొన్ని బాగుంటాయి, కొన్ని చెండాలంగా అవుతాయి.
మనీ ఎంత improvised సినిమానో చూస్తుంటే అర్థం అవుతుంది, కోట మీద కెమెరా పెట్టి, తేజ సిగరెట్ కాల్చడానికి వెళ్లుంటాడు, అందుకే పిచ్చ కిక్ ఆస్ ఉంటది సీన్, “నీకు నచ్చింది, వచ్చింది చేసే” అని వదిలెయ్యడం. “నేను ఉన్నా కదా, హమ్ దికాతే” రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పాడేస్తాడు కోట, సినిమాలో ఒక కమియో అంత హిట్ అంటే, మెంటలే. ఉతేజ్ పక్క హైదరబాద్ బాయ్, అదొక మెమొరబుల్ కామియో. పరేష్ రావల్ ఒక పార్టీ కి అటెండ్ అవ్వడం, అక్కడ పరేష్ నీ పక్కన పెట్టి, కొత్త కారెక్టర్స్ నీ ఇంట్రడ్యూస్ చేసి, సీన్స్ చేసి ఒక పాట షూట్ చెయ్యడం కన్నా సినిమాలో relaxation ఇంకేం ఉంటుంది. You forget everything, story, main actors, that’s such a relief for sometime కానీ money లాంటి సినిమా ఇన్ జనరల్ గానే పిచ్చ relaxed సినిమా, పెద్దగా హడావిడి ఉండదు. సో, అలాంటివి అన్ని additional entertaining elements లాంటివే.
పరేష్ acting ఎంత subtle గా, “వీడెంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు” అని సినిమాలోనే పోలీస్ ఆఫీసర్ తో చెప్పించాడంటే నాగేశ్వర రావుకి ఎన్ని సార్లు పరేష్ యాక్టింగ్ ఓవర్ గా అనిపించిందో అనుకున్న. మంచి మొగుడు లేబుల్ కోసం పరేష్ చేసే ఆక్టింగ్లు నిజంగానే ఘోరం, యెట్ ఫన్నీ.
మాలాంటి వాళ్ళు రెంట్ కోసం సినిమాలు, సీరీస్లు ప్లాన్ చేస్తుంటే, జేడీ అండ్ చిన్నా లాంటోలు casual గా రెంట్ కట్టాలి, ఉద్యోగం రావాలంటే లంచం ఇవ్వాలి, దానికో 50k కావాలి, రేణు నీ చిన్నా పెళ్లి చేసుకోవాలంటే ఉద్యోగం ఉండాల్సిందే, సో ఉద్యోగం కావాలి. 50k, ఎలా? ఏముంది పక్కన ఉండే రిచ్ ఆంటీ నీ కిడ్నాప్ చెద్దం, వాళ్ళ ఆయనకి కాల్ చేసి వార్నింగ్ ఇద్దాం, అంతే ఒక లక్ష రూపాయిలు డిమాండ్ చేదాం అని సింపుల్‌గా ప్లాన్ చేస్తాడు జేడీ, ఎంత సింపుల్ అంటే రెప్పోదున్న పూర్ణ హోటల్ కి వెళ్లి ఒక ఆనియన్ పెసరట్టు తిందాం అన్నట్టు. సినిమా అంత సింపుల్‌గా ఉన్నపుడు అందులో సీన్స్, decisions కూడా అంతే సింపుల్‌గా ఉంటాయి. మోస్ట్ ఫన్నీ థింగ్ ఏంటంటే, కిడ్నాప్ చెయ్యడానికి రిచ్ లేడీ అయిన జయసుధనీ వీళ్ళు ఫాలో చెయ్యాలి, ఆమేమో కార్లో తిరుగుతుంటుంది, మరి మన వాళ్ళు ఎలా ఫాలో అయ్యేది, వీళ్ళ దగ్గర బైక్, కనీసం సైకిల్ ఉండదు. సో, ఆటోలో జయసుధనీ ఫాలో అవుతుంటారు, కానీ చిన్న మాత్రం ఆటో మీటర్ వైపే చూస్తుంటాడు, టెన్షన్ వచేస్తుంటది, 50 paise 50 paise పెరిగిపోతుంటే, జేడీ ఏమో “నువ్వు ఆగురా బాబు” అంటూ, వావ్. ఎట్టకేలకు ఒక దగర కార్ ఆగుతుంది, ఆటో దిగుతారు. 17/20 rupees అయింది మీటర్, కట్టడానికి 10 రూపాయిలు తక్కువ పడతాయి, lucky గా రేణు కనిపిస్తే చిన్నా వెళ్లి అప్పుగా 10 రుపీస్ తీసుకొని ఆటో వాడికి ఇచ్చి పంపిస్తాడు.
అసలు ఇంత దరిద్రంలో ఉంటూ, చాలా మంచి వాళ్ళైనా జేడీ & చిన్న జయసుధ నీ చాలా సింపుల్ గా, casual గా కిడ్నాప్ చేస్తారు, అదే కిక్ అదే మేజిక్ అండ్ అదే money!
Everything about Money is too comforting, brilliant, simple and effective, అందుకే 150 సార్లు private projections అయ్యాయి, ఇంటర్వ్యూ లో నాగేశ్వర రావు, “ఈ సినిమా వచ్చినప్పుడు హైదరబాద్‌లో ఈ సినిమా చూడని వాడు లేడు” అని చెప్తుంటే, ఎంత హిట్టో అనిపించింది. Debut డైరెక్టర్ నీ, టీమ్ నీ నమ్మి 30 years కిందనే వర్మ 50లక్షలు పెట్టి సినిమా produce చేశాడంటే సినిమా అంటే ఎంత ఇష్టం ఉండాలి. ఇలాంటి experiments ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ నమ్మి ఇన్వెష్ట్ చెయ్యడం, ఏమో అది ఎంత వరకు పాజిబులో చెప్పలేం. కానీ వర్మ లాంటోలో, సినిమా అంటే పిచ్చి ఉన్నవాళ్లే చెయ్యగలరు.
తేజ cinematography beautiful, simple గా ఉంటుంది, కథ, కారెక్టర్లు ఇంపార్టెన్స్ ఎక్కువ ఉన్న సినిమా, ఇంక్ లైటింగ్, extra గా cinematography style చూపించే అవసరం లేదు, డ్రామా చాల్లు, అంత దాని మీదే నడుస్తుంది. హైదరబాద్నీ, మహేశ్వరి theatre నీ, అండ్ క్లైమాక్స్ లో పరేష్ తప్పించుకొని పారిపోయే షాట్స్ లో హైదరాబాద్, ఇవ్వని మాడ్. లిరిక్స్ అయితే పిచ్చ న్యూ ఎజ్, ఎడిటింగ్ కూడా జస్ట్ టూ క్రేజీలీ casual. ఫ్రెండ్స్ అందరు కలిసి ఎవరికి నచ్చింది వాళ్ళు చేశారు, లాంటి సినిమా. 3 decades బ్యాక్ తీసిన cult ఇది. ఇలాంటి సినిమాలు రావాలంటే తీసే వాళ్ళు అంత కల్ట్ ఉండాలి, ఫ్రీడమ్ తో సినిమా చేసే రోజులు పోయాయి, చేసిన ఎవడు చూడడు, పెట్టిన డబ్బులు వెన్నకి రావని ప్రొడ్యూసర్ల ఏడుపు. అసలు కొత్త సినిమా ఎలా వస్తుందో? ప్రస్తుతానికి హైదరబాద్‌లో అవంతి ఉంది, కానీ ఇంకో పరెల్లెల్ సినిమా ఎక్కడిది? ఇంకో money రావాలంటే, ఎవడైనా తీయాలంటే, అది సినిమా అంటే ఇష్టం ఉన్నా వాడే తీయాలి, ప్రమోషన్స్, మార్కెటింగ్, రిలీజ్ ప్లాన్స్ చేసే వాళ్ళతో అవ్వని కష్టమైన పనులు.
సినిమా దానంతట అది కమర్షియల్ అయ్యి, డబ్బులు తెచ్చి పెడితే మంచిదే అనుకోవడం మర్చిపోయి, అసలు డబ్బుకోసమే సినిమాలు తీసే రోజులో ఉండడం, అందుకే చూసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ చూస్తున్నాం, అవే తీస్తున్నారు వాటికే డబ్బులు వస్తాయి, అవే ఉంటాయి. కనీసం మేము చేసే సినిమాలు down the next 10 years, జనాలు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్న, ఎప్పటికైనా వాళ్ళ taste మారితే. Actually, producers మారాలి, వాళ్ళు మారారు ఎందుకంటే డబ్బులు వాళ్ళవి కదా, కొత్తదనాన్ని చూసి అర్థం చేసుకునే brilliance ఎంత మందికి ఉంటుంది. అందుకే వర్మ బ్రిలియంట్, he understands the film.
మనీ గురించి చెప్పుకుంటూ పోతే ఇప్పట్లో ఆగదు, అలాంటి సినిమా అది. వీలైతే re-visit చెయ్యండి, చిల్ అవ్వండి.