అమోల్ పాలేకర్ పాటలు తెగ వింటుంటాను నేను, ఏమన్నా వినాలి అనిపించి ఏం తట్టకపోతే అమోల్ పాటలే. అసలేమన్నా చూసానా తన films అంటే గుర్తులేదు, చూసే ఉంటాను, బాగా తెలిసిన వాడిలా అనిపిస్తాడు అమోల్, అదేగా అతని popularity, మధ్యతరగతి హీరో. Same with basu chatterjee, ఈ దర్శకుడి గురించి చాలా విన్నాను, చూసే ఉంటాను ఈయన films కూడా, చిన్నప్పుడు దూరదర్శన్ లో. Youtube recommendations లో వస్తే “chhoti si baat” చూసాను ఈరోజు. మంచి quality ఉన్న video, హిందీ వాళ్ళు పాత సినిమాలు restore చేసినంతగా మనోళ్లు చేయరెందుకో!
Titles దగ్గర్నుంచే very interesting film, అక్కడ్నుంచి సినిమాలో రాబోయే పాత్రలని voice over తో పరిచయం చేయడం, అమోల్ పాలేకర్ entry, నడుచుకుంటూ వస్తున్న అమోల్ పాలేకర్ మీద frontal handheld follow shot, ఎంత బాగుందో, ఇలాంటి షాట్లు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. Bus stop లో హీరో ఎవరి కోసమో వెయిట్ చేస్తుంటాడు, హీరోయిన్ ఎంట్రీ, విద్యా సిన్హా, ఎంత beautiful గా ఉందో. ఇక్కడ్నుంచి, హీరో హీరోయిన్ ని ప్రతిరోజూ stalk చేస్తుంటాడు, beautiful stalking, తన ప్రేమని వ్యక్తపరచలేని introvert. విద్యా సిన్హా చీరలు very beautiful, ఇద్దరూ పని చేసేది వేరువేరు ఆఫీసుల్లో, ఆమెని ఆఫీస్ దాకా వెంటపడి రోజూ తన ఆఫీస్ కి లేట్ గా వెళ్తుంటాడు. ఆఫీస్ లో మంచి position అయినా హీరో కింద పనిచేసేవాళ్ళు అతన్ని లెక్క చేయరు, ఎందుకంటే మంచోడు కాబట్టి.
అలా beautiful చీరల్లో తిరుగుతున్న విద్యా సిన్హా వెంటపడి పడి, ఆమె తన కొలీగ్ తో క్లోజ్ గా ఉండటం భరించలేకపోయినా ఏమి చేయలేని హీరో ఎప్పుడూ కలల్లో బతుకుతుంటాడు, ఎన్ని కలలో సినిమాలో. తన వెంటపడుతున్న అమోల్ గురించి స్నేహితురాలితో చెప్పుకుని మురిసిపోతుంటుంది విద్యా. చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేసిచేసి హీరో ఖండాలలో దిగుతాడు అక్కడ ఏ పనైనా చేయగలిగేరిటైర్డ్ కల్నల్ ఒకాయన ఉన్నాడని కనీసం అతనైనా తన ప్రేమని గెలిచే మార్గం చూపిస్తాడనే ఆశతో వెళ్తాడు.
బసు ఛటర్జీ సినిమాలు realistic గా ఉంటూ సున్నితమైన హాస్యంతో నడిచిపోతాయని చాలా చదివాను and చాలా మంది హిందీ దర్శకులు ఆయన గురించి మాట్లాడటం చూసాను. 1976 లో వచ్చిన సినిమా, అప్పటి ముంబైని ఎంత బాగా చూపించాడంటే, రోడ్ల మీద చాలా సీన్లు ఉంటాయి, పక్కన జనాలు షూటింగ్ చూస్తున్నా పట్టించుకోని filmmaking, classic దర్శకులు అలాంటి వాటిని పట్టించుకోరు, పాత్రలే ముఖ్యం, మన జంధ్యాల కూడా అంతే. సినిమాటోగ్రఫీ కథలో కలగలిసిపోయిన beautiful film. Beautiful performances,music,locations,direction, just beautiful.
కథ ఖండాల వెళ్లిన దగ్గరనుంచి నాకు silly గా అనిపించింది, ఆ కల్నల్ హీరోని మార్చే ప్రక్రియ మొదలవుతుంది, ఏంటేంటో చేస్తుంటాడు చెప్తుంటాడు ఆ కల్నల్. ఒక సీన్లో తను చెప్పింది తనకే అర్ధం కానప్పుడు నీకెలా అర్థమైందని హీరోని ప్రశ్నిస్తాడు కూడా. అమ్మాయిలు ఎలా పడతారు, వాళ్లని ఎలా ఒప్పించాలి మెప్పించాలి ఎలా వశపర్చుకోవాలి అనే విద్యలన్నీ నేర్పించి, హీరోతో పాటు ముంబై వస్తాడు, ఎందుకంటే తను నేర్పించినవి ఎలా apply చేస్తావో చూస్తాను అని. ఇది ఈకలు పీకడం కాదండోయ్, మీరూ సినిమా చూడండి, నేను రాసింది మీకు అర్ధమవుతుంది.
ఇక్కడ్నుంచి హీరో చెలరేగిపోతాడు, హీరోయిన్ ఏ కొలీగ్ తో అయితే క్లోజ్ గా తిరుగుతుందో వాడిని ఓడించడమే హీరో లక్ష్యం, టేబుల్ టెన్నిస్ లో ఓడిస్తాడు, చెస్ లో ఓడిస్తాడు, flirting లో ఓడిస్తాడు, చైనీస్ food తినడంలో ఓడిస్తాడు. ఇవన్నీ కొన్ని రోజుల్లో కల్నల్ నేర్పించిన talents. ఇంకా చాలా విషయాల్లో వాడిని ఓడించి హీరోయిన్ ని గెల్చుకుంటాడు. ఇదంతా ఎంత సిల్లీ గా అనిపించినా సినిమా మాత్రం beautiful.
ఒక సీన్లో అమితాబ్ బచ్చన్ అలా మెరిసి వెళ్ళిపోతాడు, హీరోలాగే మనమూ అవాక్కవుతాం.