కథలో conflict ఏంటి ? ఇదే అతి పెద్ద interesting element, ఒక డైరెక్టరో రైటరో పాయింట్ అనుకున్న దగ్గర నుంచి కథలో conflict కోసం చాలా conflict అనుభవిస్తుంటారు. ఒక్కోసారి అనుకున్న basic idea లోనే భయంకరమైన conflict ఉంటుంది, కానీ దాని చుట్టూ సీన్లు అంత ఈజీగా రావు, ఎందుకంటే conflict అంత strong అన్నమాట. ఉండాల్సిందేనా conflict ? నా ఉద్దేశంలో conflict అనేది ఏ కథలో అయినా ఉంటుంది, చిన్నదో పెద్దదో కనీకనిపించకుండానో, అది external physical conflict అవొచ్చు ఒక పాత్ర internal conflict అవొచ్చు. మా fiction లో conflict అనేది bang లెవెల్లో ఉండదు, అందుకే మేము నిర్మాతల్ని మెప్పించలేపోతున్నాం. ఏ నిర్మాతైనా చూసేది అదే, ఈ conflicting point ప్రేక్షకులకి ఎక్కుతుందా లేదా అని.
అలా hard hitting ‘సంఘర్షణ’ లేని సినిమాలు వస్తుంటాయి, but rare గా. ఆడియెన్సులు కూడా అంత ఈజీగా ఉండే సినిమాలు ఒప్పుకోలేరు, ఇలాంటి వాటికి కొంతమంది connect అయి బాగా enjoy చేస్తారు, అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు నీకు అనే దాని మీదే నీ బడ్జెట్లు. ఆ కోణంలో మేము చాలా మెల్లిగా spread అవుతున్నాము, మాకూ నిర్మాతలొస్తున్నారు ఇప్పుడు, కానీ బాగా low budgets, no regrets, మేము అనుకున్నది చేయనిచ్చే నిర్మాత దొరికితే చాలు.
నేను ఏ కథ అనుకుని రోహిత్ కి చెప్పినా దాంట్లో ఖచ్చితంగా ఆ conflict element ఉంటుంది, నేనూ తెలుగు,హిందీ,హాలీవుడ్ సినిమాలు చూసి పెరిగిన వాణ్ణే కదా, ఆ ప్రభావం ఎలా తప్పించుకోగలం? నిన్నే ఒక 21ఏళ్ళ అబ్బాయి, 18ఏళ్ళ అమ్మాయి ప్రేమకథ చెప్పా రోహిత్ కి, సిద్ధిపేటలో జరిగే కథ. అక్కడే ఎందుకు జరుగుతుంది , ఆ ఊర్లో నిన్న ఒక షూట్ చేసాం, night shoot, మధ్యాహ్నం బార్లో బీరు తాగుతుంటే, ఆ బార్ నచ్చేసి ఈ ఊర్లో ఏదో ఒకటి తీయాలి అని డిసైడ్ అయి, ప్రేమకథ అనుకుని, అబ్బాయిది normal గా కనిపించే life అయినా, వాడికి ఒక క్రైమ్ తో సంబంధం ఉంటుంది, pre climax లో అది బయటపడి రచ్చ అయి film end అవుతుంది. ప్రేమలో ఉన్న ఆ కుర్రాడికి crime link ఉండటమే నాకు అనిపించిన conflict. రోహిత్ కి చెప్పాను కూడా, గ్లాస్ బీర్ తర్వాత తొక్కాలాగుంది crime angle, అసలు ఆ వయసులో ఒక middle class అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ అనేదే అతి పెద్ద conflict అనిపించి క్రైమ్ వదిలేసా.
So నాకు ఎప్పుడూ కథలో conflict or conflict ఉన్న కథలు సృష్టించడం పెద్ద problem అనిపించదు, పాత్రల జీవనవిధానంలో ఉంటుంది ఆ సంఘర్షణ, అది నా curiosity, ఇప్పుడు ఈ character ఈ సమస్యని ఎలా solve చేస్తుంది? చేయకపోవచ్చు కూడా, అలాంటి conclusion లేని endings అంటే నాకూ రోహిత్ కి చాలా ఇష్టం. A LOVE LETTER TO CINEMA లో ఎలాంటి conflict లేదు అనిపిస్తుంది చూసినవాళ్ళకి, వాళ్ళు కరెక్టే, కానీ నా దృష్టిలో ఆ సినిమాలో conflict ఉంది, ఒక filmmaker తను తీయాలనుకుంటున్న సినిమాకి test shoot చేస్తున్నాడు, అది ఎలా చేయాలా అనే అతని internal conflict is the film. ఇది అసలు ప్రేక్షకులకి అనిపించదు కనిపించదు.
Story Discussion 1 అంతా conflicts ఉంటాయి కానీ అవి మొహం మీద కొట్టినట్టు ఉండవు, central conflict అంటూ ఏం ఉండదు దీంట్లో, story Discussion 2లో ప్రకాష్ చౌదరి అనే పాత్ర బతకడానికి పడే కష్టాలే అతని నిత్య సంఘర్షణ. Sheesh mahal జరిగే నాలుగు కథలకి ఏదొక సమస్య ఉంటుంది, ఫకీర్ అనే చెత్త ఏరుకునే పిల్లోడు పోలీసుల నుంచి తప్పించుకోవటం, ఫిరోజ్ అనే single screen canteen ఓనర్ దైనందిన మధ్యతరగతి జీవితంతో చేసే పోరాటం, rk అనే filmmaker తనేదో తీసేయాలనే తాపత్రయం, film festival లో కలిసిన టీనేజ్ అమ్మాయి అబ్బాయి జరిగే infatuation conflict, ఇలా ఏదో ఒకటైతే ఉంటుంది.
నేనెప్పుడూ నన్ను కలిసే young filmmakers కి ఒక routine example చెప్తుంటా, “నువ్వు నన్ను కలవాలనుకున్నావ్, నంబర్ సంపాదించావ్, ఒక టైం అనుకున్నాం కలవటానికి, ఎక్కడి నుంచో వచ్చావ్”, ఇదే కథ అనుకో, నువ్వే పెట్టే మెసేజ్ కి నేను రిప్లై ఇస్తానా లేదా ఇది నీ ఫస్ట్ ఆలోచన, ఇక్కడ మొదలవుతుంది conflict, అక్కడ నుంచి నన్ను కలిసి నువ్వు నీ రూమ్ కి వెళ్ళేలోపు ఏమైనా జరగచ్చు, నీ బండి పంక్చర్ అవొచ్చు, నీ జేబులో డబ్బులు లేకపోవచ్చు, ఇంకేమైనా అనుకో, దీన్ని నువ్వు slice of life నుంచి science fiction దాకా తీసుకెళ్లొచ్చు. That is up to your imagination.
మా సినిమాలు మరీ soft అయిపోతున్నాయి, కాస్త strong గా కొడదాం ప్రొడ్యూసర్స్ ని ఆడియన్స్ ని కథలో conflict తో అని చాలా రోజులుగా రకరకాల points అనుకుంటున్నాం, అవి ఎంత strong గా ఉన్నా మా realistic & character centric filmmaking approach లో మాత్రం మార్పు రాదు.
పొద్దున్నే లేచి చాయ్ డబ్బుల కోసం పడే అవస్థలో CONFLICT మాకెప్పుడూ ఇష్టమే.
నా రాత మీకు నచ్చితే కింద qr code ఉంది కొట్టగలిగినంత కొట్టేయండి.